సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) గెస్ట్‌ రోల్‌లో నటించిన సినిమా లాల్‌సలామ్‌(Lal Salaam). లాస్టియర్‌ జైలర్‌తో(Jailer) హిట్‌ కొట్టిన రజనీకాంత్‌ ఇప్పుడు తన కూతురు ఐశ్యర్య(Aishwarya ) దర్శకత్వంలో నటించారు. ఇందులో హీరో విష్ణు విశాల్‌(Vishnu vishal), విక్రాంత్‌ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇవాళ విడుదలయ్యింది. నిజానికి రజనీకాంత్‌ సినిమా వస్తున్నదంటే వారం రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) గెస్ట్‌ రోల్‌లో నటించిన సినిమా లాల్‌సలామ్‌(Lal Salaam). లాస్టియర్‌ జైలర్‌తో(Jailer) హిట్‌ కొట్టిన రజనీకాంత్‌ ఇప్పుడు తన కూతురు ఐశ్యర్య(Aishwarya ) దర్శకత్వంలో నటించారు. ఇందులో హీరో విష్ణు విశాల్‌(Vishnu vishal), విక్రాంత్‌ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇవాళ విడుదలయ్యింది. నిజానికి రజనీకాంత్‌ సినిమా వస్తున్నదంటే వారం రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. తెలుగునాట కూడా అంతే! కానీ లాల్‌ సలామ్‌ సినిమాకు మాత్రం ఊహించని షాక్‌ తగిలింది. తమిళనాడులో ఓకేనే కానీ ఇక్కడ మాత్రం ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా చాలా చోట్ల మార్నింగ్ షోలను రద్దు చేయాల్సిన దుస్థితి వచ్చింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా మొదటి రోజే చాలాచోట్ల మార్నింగ్‌ షోలు రద్దు కావడం దిగ్బ్రాంతిని కలిగించే విషయం. హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌ల్లో రజనీకాంత్‌ సినిమా చూడాలనుకున్న తెలుగు ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల టికెట్లు కొనేవాళ్లు లేక మార్నింగ్ షోలు రద్దు చేశారు. అయితే అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకున్న వారికి థియేటర్ల యాజమాన్యాలు డబ్బులు రిఫండ్‌ చేశాయి. రజనీకాంత్‌ నటించిన సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోలకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు అంటున్నారు.

Updated On 9 Feb 2024 6:59 AM GMT
Ehatv

Ehatv

Next Story