విలక్షణ నటుడు శ్రీహరి(Srihari)పుట్టింది శ్రీకాకుళం జిల్లా. కానీ చిన్నప్పుడే కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. ఆ గ్రామం రోడ్డు పక్కన ఓ చిన్న పాక వేసుకుని సైకిల్‌ షాపు పెట్టుకున్నారు. అక్కడే సోడాలు కూడా అమ్మేవారు. అలా జీవనం సాగించారు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం.

విలక్షణ నటుడు శ్రీహరి(Srihari)పుట్టింది శ్రీకాకుళం జిల్లా. కానీ చిన్నప్పుడే కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. ఆ గ్రామం రోడ్డు పక్కన ఓ చిన్న పాక వేసుకుని సైకిల్‌ షాపు పెట్టుకున్నారు. అక్కడే సోడాలు కూడా అమ్మేవారు. అలా జీవనం సాగించారు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఎలాగైనా సరే నటుడు కావాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. తన కోరికను నెరవేర్చుకోవడానికి అరెకరం భూమిని అమ్మి హైదరాబాద్‌కు వచ్చారు. చిన్న చిన్న పాత్రలు వేస్తూ అగ్రపథానికి చేరుకున్నారు. సినీ పరిశ్రమలో విశిష్ట వ్యక్తిత్వం ఉన్న నటుడు ఎవరంటే అందరూ శ్రీహరి పేరే చెబుతారు. సాయం కోసం ఆయన దగ్గర వెళితే కాదని ఏనాడూ చెప్పలేదు. పది మందికి సాయం చేసే గుణం ఆయనది! డిస్కో శాంతి(Disco Shanti)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్‌ కోసం ముంబాయికి వెళ్లి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే శ్రీహరిని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013 తేదీన కాలేయ సంబంధ వ్యాధితో ముంబాయిలోనే కన్నుమూశారు శ్రీహరి. శ్రీహరి చనిపోయిన సమయంలో ఏం జరిగిందో డిస్కో శాంతి తాజాగా చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్‌ మధ్యలో అనారోగ్యానికి గురైన శ్రీహరిని ముంబాయిలోని లీలావతి హాస్పిటల్‌లో చేర్చారు. ఐసీయూలో చికిత్సను అందించారు. 'శ్రీహరి చనిపోయే కొన్ని గంటల ముందు వైద్యులు చెకప్‌కు వచ్చారు. ఆ సమయంలో నన్ను బయటకు పంపించారు. అప్పుడు వాళ్లు కొన్ని మందులతో పాటు ఇంజక్షన్స్‌ సూచించారు. కొంత సమయం తర్వాత ఒక నర్సు వచ్చి ఆ ఇంజక్షన్‌ వేసింది. కొన్ని నిమిషాల్లోనే శ్రీహరి కళ్లు,ముక్కు,చెవులు నుంచి రక్తం వచ్చింది. నాకు హిందీ రాదు.. వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వాళ్లు రక్తం మొత్తం క్లీన్‌ చేసి ఆయనను మరో గదిలోకి తీసుకుపోయారు. నేను ఎంత మొత్తుకున్నా శ్రీహరి దగ్గరకు కూడా పోనియలేదు. వంద శాతం ఆ డాక్టర్లు రాంగ్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. ఇదే హైదరాబాద్‌లో అయింటే ఆయన ఖచ్చితంగా బతికేవాడు.' అని కన్నీళ్లతో డిస్కో శాంతి తెలిపారు. శ్రీహరి చనిపోయి చాలా సేపటి తర్వాతే తనకు సమాచారం అందించారని, చనిపోయినప్పటికీ వైద్యం అందిస్తున్నామంటూ తనతో చాలా డబ్బు కట్టించుకున్నారని చెప్పారు. 'ఆసుపత్రి మీద కేసు పెట్టమని చాలా మంది చెప్పారు. ఆయన చనిపోతేనే మన అనుకునేవాళ్లు ఎవరూ రాలేదు. మళ్లీ ఈ కేసుల విషయంలో పిల్లలను పట్టుకుని నేను ఎక్కడ తిరగను? అందుకే ఆ ఆలోచన విరమించుకున్నాను' అని శాంతి ఎమోషనల్‌ అయ్యారు. శ్రీహరి చనిపోయిన తర్వాత స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరూ తమ ఇంటికి రాలేదని శాంతి పేర్కొన్నారు. కనీసం తాము ఉన్నామో లేమో కూడా వాళ్లకు తెలియదని ఆవేదన చెందారు. శ్రీహరి గతంలో ఎవరికి డబ్బు ఇచ్చారు. ఎవరిదగ్గర దాచారు అనేది తెలియదు. కానీ కొంతమంది ఆర్థిక విషయాల్లో తమను మోసం చేశారని శాంతి పేర్కొన్నారు. శ్రీహరి మరణం తర్వాత ఒక్కసారిగా తమకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయన్నారు. కొంతమంది మోసం కారణంగా డబ్బు కోల్పోయాని తెలిపారు. అదే డబ్బు ఉండిఉంటే తన కొడుకు చదవుకునేందుకు విదేశాలకు వెళ్లేవాడని శాంతి తెలిపింది. తమకు రావాల్సిన డబ్బు అయితే తిరిగిరాలేదు కానీ తాము తీసుకున్న అప్పువాళ్లు మాత్రం ఇంటికి వచ్చారని చెప్పింది. అప్పుడు చేసేదిమి లేకపోవడంతో తమ వద్ద ఉన్న కార్లు, భూమి, బంగారం అన్నీ అమ్మేసి అప్పులు తీర్చానని అన్నారు. 'చివరకు ఎంతో ఇష్టంగా కొనుకున్న ఒక కారు ఈఎంఐ కూడా కట్టలేకపోతే బ్యాంకు వారు తీసుకుపోయారు. తాళి మాత్రమే ఉంచుకుని మిగిలిన బంగారాన్ని మొత్తం కోల్పోయాను. ప్రస్తుతం జీవనోపాధికి తమ రెండు ఇళ్ల నుంచి అద్దె వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం మేము ఉంటున్న ఇళ్ల నుంచి కొంత భాగం రోడ్డు డివైడింగ్‌ కోసం పోయింది. అందుకు సంబంధించి వచ్చిన డబ్బు బ్యాంకులో డిపాజిట్‌ చేశాము. సినీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను' అని డిస్కో శాంతి వివరించారు.

Updated On 18 Aug 2023 2:04 AM GMT
Ehatv

Ehatv

Next Story