లేడి సూపర్‌స్టార్ నయనతారకు(Nayantara) కొత్త కష్టం వచ్చిపడింది. దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో(Vignesh Shivan) నయనతార ఆరేళ్ల కిందట ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ప్రేమ జోడి తరచూ వార్తల్లోకి వచ్చేవారు. దక్షిణాదిలోని అన్ని భాషలలో నటిస్తూ అగ్రశ్రేణి హీరోయిన్ హోదాను అనుభవిస్తున్న నయనతార కుటుంబజీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలతో ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు.
లేడి సూపర్‌స్టార్ నయనతారకు(Nayanthara) కొత్త కష్టం వచ్చిపడింది. దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో(Vignesh Shivan) నయనతార ఆరేళ్ల కిందట ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ప్రేమ జోడి తరచూ వార్తల్లోకి వచ్చేవారు. దక్షిణాదిలోని అన్ని భాషలలో నటిస్తూ అగ్రశ్రేణి హీరోయిన్ హోదాను అనుభవిస్తున్న నయనతార కుటుంబజీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలతో ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు.
అయితే వ్యక్తిగతమైన సమస్యలే అప్పుడప్పుడు ఆమెకు ఎదురవుతుంటాయి. విఘ్నేశ్, నయన్ జోడి సరోగసి(surrogacy) విధానం ద్వారా కవలపిల్లలకు(Twin) తల్లిదండ్రులు అయిన విషయం కూడా వివాదమయ్యింది. అదలా ఉంచితే, ఈ జంటకు ఇప్పుడు మరో సమస్య ఎదురయ్యింది. విఘ్నేశ్ శివన్ పూర్వీకులది తిరుచ్చి జిల్లా లాల్‌కుడి గ్రామం. ఈయన తండ్రి పేరు శివ కొళుదు. వీరు తొమ్మిది మంది అన్నదమ్ములు.
పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా(Police Informer) పని చేసిన విఘ్నేశ్ శివన్ తండ్రి శివకొళుదు(Shiva Koludhu) ఇప్పుడు లేరు. అయితే ఆయన బతికున్న కాలంలో తమ ఉమ్మడి ఆస్తిని అన్మదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా తన పేరిట రాసుకున్నారని ఆయన సోదరుడు మాణిక్యం తిరిచ్చి డీఎస్పీ కార్యాలయంలో (DSP Office)ఫిర్యాదు చేశాడు. కోయంబత్తూరులో(Coimbatore) ఉంటున్న మరో సోదరుడు కుంచితపాదం కూడా మాణిక్యంతో జత కలిశారు. తమ సోదరుడు విఘ్నేశ్ శివన్ తండ్రి ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండా వేరే వారికి విక్రయించి తమను మోసం చేశాడని,
తమ ఆస్తిని కొన్నవారికి డబ్బును తిరిగి ఇచ్చి, ఆస్తినితమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా తమ సోదరుడి కుమారుడు విఘ్నేశ్ శివన్, అతని తల్లి మీనా కుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాలని మాణిక్యం పోలీసులకు ఇచ్చి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తిరుచ్చి డీఎస్పీ ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.