దర్శకుడు వెట్రిమారన్‌(vetrimaran) క్రియేటివ్‌ డైరెక్టర్‌. ఈయనకు తమిళ ఇండస్ట్రీలోనే కాదు, తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఏడాది విడుతలై : పార్ట్‌ వన్‌తో(Viduthalai :Part 1) ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో దీనిని విడుదల పార్ట్‌ 1 పేరుతో విడుదల చేశారు. ఇక్కడా సినిమాకు మంచి ఆదరణ వచ్చింది.

దర్శకుడు వెట్రిమారన్‌(vetrimaran) క్రియేటివ్‌ డైరెక్టర్‌. ఈయనకు తమిళ ఇండస్ట్రీలోనే కాదు, తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఏడాది విడుతలై : పార్ట్‌ వన్‌తో(Viduthalai :Part 1) ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో దీనిని విడుదల పార్ట్‌ 1 పేరుతో విడుదల చేశారు. ఇక్కడా సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. ప్రస్తుతం దానికి కొనసాగింపు సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. చెన్నైలో(chennai) సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో(Pressmeet) వెట్రిమారన్‌ తన కొత్త సినిమా వాడి వాసల్‌(vadi saval) అప్‌డేట్‌ ఇచ్చారు.

అలాగే ధనుష్‌(Danush) హీరోగా నటిస్తున్న హిట్‌ సినిమా సీక్వెల్‌ గురించి మాట్లాడారు. వాడి వాసల్‌ సినిమాలో సూర్య(surya) హీరోగా నటిస్తున్నారన్న విషయ తెలిసిందే. ఈ చిత్రాన్ని 2021లో ప్రకటించారు. అయితే కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ నిరుడు ప్రారంభమయ్యింది. ఆ తర్వాత షూటింగ్‌ ఎంత వరకు పూర్తయ్యింది? ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది? అన్న విషయాలేమీ చిత్ర బృందం ఇప్పటి వరకు చెప్పలేదు.

తాజా ప్రెస్‌మీట్‌లో వెట్రిమారన్‌ ప్రేక్షకుల సందేహాలన్నింటికీ జవాబిచ్చారు. విడుతలై : పార్ట్‌ 2(Viduthalai : part 2) పని పూర్తి కాగానే వాడి వాసల్‌ చిత్రీకరణను మళ్లీ మొదలు పెడతామని అన్నారు. జల్లికట్లు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ఎద్దు సన్నివేశాల కోసం లండన్‌లో ఇప్పటికే కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ పనులు మొదలయ్యాయని వెట్రిమారన్‌ తెలిపారు. ప్రస్తుతం అంగీకరించిన సినిమాలన్నీ పూర్తియిన తర్వాత వడ చెన్నై(Vada Chennai) సినిమాకు సీక్వెల్‌(sequel) చేసే అవకాశం ఉందన్నారు.

ధనుష్‌ హీరోగా ఆయన గతంలో రూపొందించిన వడ చెన్నై సినిమా తమిళనాట ఘన విజయం సాధించింది. మరోవపు విజయ్‌తో ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు వెట్రి మారన్‌. ఇది ఇప్పుడు చర్చల దశలో ఉంది. ప్రముఖ హీరో ఎన్టీఆర్‌తో కలిసి పని చేయాలని ఉంది కానీ, అందుకు చాలా సమయం పడుతుందని వెట్రిమారన్‌ తెలిపారు. అయితే అది సోలో హీరో సినిమానా? మల్టిస్టారరా? అన్న విషయానికి కాలమే సమాధానం చెబుతుందని వెట్రిమారన్‌ అన్నారు. అలాగే, ఏ కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా రావాలన్న దానిపై తనకు స్పష్టత ఉందని, స్టార్‌ వాల్యూ, కాంబినేషన్‌ వాల్యూ కాకుండా తాను ఎంచుకునే కంటెంట్‌ ఫలానా స్టార్‌ కావాలని డిమాండ్‌ చేస్తే అతనితో సినిమా చేస్తానని వెట్రిమారన్‌ వివరించారు.

Updated On 27 Jun 2023 12:50 AM GMT
Ehatv

Ehatv

Next Story