‘కేజీఎఫ్2’ సినిమాపై ‘C/O కంచరపాలెం’ మూవీ డైరెక్టర్ వెంకటేష్ మహా ఘాటు విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్లు నందినిరెడ్డి, మోహనకృష్ణ ఇంద్రగంటి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వణ పార్టిసిపేట్ చేశారు. ఇటీవల కాలంలో తాము కొత్త సినిమాలతో ముందుకు రావడం లేదని, ఎందుకంటే తాను నిర్మాతలకు అనేక కథలను అందిస్తున్నానని, కానీ అవి ఓటీటీ కంటెంట్ కథలని రిజెక్ట్ చేస్తున్నారన్నారు. కలెక్షన్లు రాబడుతున్న సినిమాలన్నీ పాప్ కార్న్ సినిమాలు అన్నారు. ‘‘తల్లి కలను నెరవేర్చడం కోసం […]
‘కేజీఎఫ్2’ సినిమాపై ‘C/O కంచరపాలెం’ మూవీ డైరెక్టర్ వెంకటేష్ మహా ఘాటు విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్లు నందినిరెడ్డి, మోహనకృష్ణ ఇంద్రగంటి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వణ పార్టిసిపేట్ చేశారు. ఇటీవల కాలంలో తాము కొత్త సినిమాలతో ముందుకు రావడం లేదని, ఎందుకంటే తాను నిర్మాతలకు అనేక కథలను అందిస్తున్నానని, కానీ అవి ఓటీటీ కంటెంట్ కథలని రిజెక్ట్ చేస్తున్నారన్నారు. కలెక్షన్లు రాబడుతున్న సినిమాలన్నీ పాప్ కార్న్ సినిమాలు అన్నారు.
‘‘తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారం సంపాదించి చివరికి ఆ బంగారాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి క్యారెక్టర్ గురించి సినిమాలు తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం, కోట్లు కోట్లు వసూళ్లు తీసుకొస్తున్నాం’’ అంటూ ఘాటుగా విమర్శించాడు. అయితే మా లాంటి ఎంతో మంది దర్శకులు మంచి సినిమాలు తీసినప్పటికీ వాటికి సరైన కలెక్షన్లు రావడం లేదని డైరెక్టర్ వెంకటేష్ మహా వాపోయారు.
మరోవైపు ఏ తల్లి అయినా తన కొడుకును రౌడీగా మారమని అడుగుతుందా, అలాంటి తల్లిని నేను కలవాలనుకుంటున్నానంటూ కమెంట్ చేశాడు. అయితే ప్రొడ్యూసర్లందరూ పెన్నుకు బదులు కత్తి-తుపాకీని తీసుకుంటే మనందరం పెద్ద బ్లాక్ బస్టర్లు చేయొచ్చని సెటైర్ వేశారు ఆయన. కేజీఎఫ్ లాంటి సినిమా క్యారెక్టర్లు ‘నీచ్ కమీన్ కుత్తే’వంటివని పోల్చారు.
డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లుతోపాటు ఇటు కేజీఎఫ్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. అయితే అందుకు రివేజ్గా సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్‌తో మీమ్స్ కూడా వేస్తున్నారు. ఎంతలా అంటే ట్రెండింగ్‌లోకి వచ్చేలా చేసేసారు. ఇక ‘C/O కంచరపాలెం’ సినిమా గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాజిటివ్‌గా మాట్లాడిన వీడియోను మహాకు ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే ఆయనపై వస్తున్న నెగిటివిటీ, ట్రోల్స్‌కి వెంకటేష్ మహా స్పందించాడు. క్షమాపణలకు బదులుగా తన కమెంట్స్ని సమర్ధించుకున్నాడు. తన అభిప్రాయం సరైనదేనని.. అయితే తాను వాడిన భాష కరెక్ట్ కాదని.. ‘‘ కొంతమందిని ఉద్దేశించి నా అభిప్రాయం చెప్పానని, నాలాగే చాలా మందికి సినిమా నచ్చలేదు’’ చెప్పుకొచ్చాడు. నేను వాడిన భాషకు క్షమాపణలు అని చెప్పాడు డైరెక్టర్
ఇక ఈ ఇష్యూపై డైరెక్టర్ నందినిరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా మాట్లాడిన విధానానికి తనకు నవ్వొచ్చిందేతప్ప ఎవరినీ, ఏ సినిమాని కించపరడం తన ఉద్దేశ్యం కాదని, తన వలన ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని నందినిరెడ్డి కోరారు. ఏదైనా డిస్కషన్ జరుగుతుంటే మనం రియాక్ట్ అవుతూ ఉంటాము తప్ప ఎవరిని నొప్పించాలని కాదని, ఎందరో కష్టించి పని చేసిన ఏ సినిమా అయినా పెద్ద సక్సెస్ ఒస్తే అందరికీ ఆనందమే అని నందినిరెడ్డి అన్నారు. ఇటు వివేక్ ఆత్రేయ కూడా తన వలన ఏదైన తప్పు దొర్లి ఉంటే, ఎవరినైనా నొప్పించి ఉంటే తనను మన్నించాలని కోరాడట.