మెగాస్టార్‌ చిరంజీవికి(Chiranjeevi) ఆచార్య ఇచ్చిన షాక్‌ మూమూలుదేం కాదు. దాన్ని నుంచి తేరుకునేలోపుగానే భోళాశంకర్‌ సినిమా కోలుకోలేని దెబ్బ తీసింది. మొదట్నుంచి ఆ సినిమాపై అనుమానాలు ఉన్నప్పటికీ ఇంత ఘోరమైన ఫ్లాప్‌ అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ సినిమా మామూలు దెబ్బ కొట్టలేదు. దెబ్బకు చిత్ర యూనిట్‌ అంతా అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయింది.

మెగాస్టార్‌ చిరంజీవికి(Chiranjeevi) ఆచార్య ఇచ్చిన షాక్‌ మూమూలుదేం కాదు. దాన్ని నుంచి తేరుకునేలోపుగానే భోళాశంకర్‌ సినిమా కోలుకోలేని దెబ్బ తీసింది. మొదట్నుంచి ఆ సినిమాపై అనుమానాలు ఉన్నప్పటికీ ఇంత ఘోరమైన ఫ్లాప్‌ అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ సినిమా మామూలు దెబ్బ కొట్టలేదు. దెబ్బకు చిత్ర యూనిట్‌ అంతా అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయింది. రిలీజ్‌ ముందు జరిగిన ప్రమోషన్‌లలో సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. విడుదల తర్వాత సైలెంట్‌ అయ్యారు. ఈ సినిమా ఫలితాన్న చూసి మెగా ఫాన్స్‌ తెగ బాధపడిపోయారు. కథపరంగా చూస్తే మంచి కమర్షియల్‌ హిట్‌ కావాల్సిన సినిమానే! కాకపోతే మెహర్‌ రమేశ్‌ పూర్తిగా చెడగొట్టాడన్నది ఫ్యాన్స్‌ కంప్లయింట్‌! ఇప్పుడు చిరంజీవికి పెద్ద హిట్‌ పడాలి. అందుకే బింబిసార దర్శకుడు వశిష్టకు(Vasista) ఓకే చెప్పారు చిరు. టైటిల్‌ పోస్టర్‌ ఈ మధ్యనే విడుదలయ్యింది. ఆ పోస్టర్‌ అందరికీ బాగా నచ్చేసింది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ మంచి ఆసక్తిని నెలకొల్పాడు వశిష్ట. లెటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను డైరెక్టర్‌ వశిష్ట చెప్పాడు. ఇందులో చిరంజీవి వయసు మళ్లిన పాత్రలో కనిపించనున్నాడట! అంటే ప్రస్తుతం చిరంజీవి ఏజ్‌కు తగ్గ రోల్‌ చేయనున్నాడు. విక్రమ్‌లో కమలహాసన్‌, జైలర్‌లో రజనీకాంత్‌లా వయసుకు తగ్గ పాత్రలో కనిపించబోతారన్నమాట. ఈ సినిమాలో హీరోయిన్లు ఉంటారు కానీ రొమాన్స్ ఉండదని, ఇదొక ఫాంట‌సీ సినిమా.. ఆ జాన‌ర్‌కు త‌గ్గట్లే సినిమా న‌డుస్తుంద‌ని దర్శకుడు వశిష్ట అంటున్నాడు. అంతేకాకుండా వశిష్ట తన చిన్నత‌నంలో జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమా చూసి ఎంత‌గానో ఎంజాయ్ చేశాన‌ని, అప్పటి పిల్లల‌కు అదొక మ‌ధుర జ్ఞాప‌క‌మ‌ని తెలిపాడు. అదే విధంగా ఇప్పటి పిల్లలు కూడా ఈ సినిమాలో చిరును చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంద‌ని వివరించాడు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారని అంటున్నారు. ఐశ్వర్యరాయ్‌, అనుష్క షెట్టి, మృణాళ్‌ ఠాకూర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ పాన్‌ ఇండియా సినిమాకు ఎమ్‌.ఎమ్‌ కీరవాణి సంగీతం అందించనున్నాడు.

Updated On 23 Sep 2023 6:28 AM GMT
Ehatv

Ehatv

Next Story