మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళాశంకర్(Bholashankar) భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. చిరంజీవి కెరీర్‌లో ఆచార్యనే(Aacharya) పెద్ద ఫ్లాప్ అనుకుంటే, భోళాశంకర్ అంతకు మించి ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా తర్వాత చిరంజీవి రెండు సినిమాలను ప్రకటించారు. ఇందులో మెగా 156(Mega 156) సినిమాను చిరంజీవి కూతురు సుష్మిత(sushmitha) నిర్మాణ సారథ్యంలో తెరకెక్కబోతున్నదని వార్తలు వచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళాశంకర్(Bholashankar) భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. చిరంజీవి కెరీర్‌లో ఆచార్యనే(Aacharya) పెద్ద ఫ్లాప్ అనుకుంటే, భోళాశంకర్ అంతకు మించి ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా తర్వాత చిరంజీవి రెండు సినిమాలను ప్రకటించారు. ఇందులో మెగా 156(Mega 156) సినిమాను చిరంజీవి కూతురు సుష్మిత(sushmitha) నిర్మాణ సారథ్యంలో తెరకెక్కబోతున్నదని వార్తలు వచ్చాయి. మెగా 157(Mega 157) సినిమాను యూవీ క్రియేషన్స్‌లో బింబిసార ఫేమ్ వశిష్టతో(Vasista) ప్లాన్ చేశారు చిరంజీవి. అయితే ఇక్కడ చిరంజీవి చిన్న మార్పు చేశారు.
మెగా 157వ సినిమాపైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. డైరెక్టర్ వశిష్ట కథ చిరుకు భారీ నమ్మకం ఏర్పడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారట!
ఈ నేపథ్యంలో మెగా 156 సినిమాను పక్కన పెట్టేసి మెగా 157 ప్రాజెక్ట్‌పైనే చిరంజీవి ఫోకస్ పెట్ఆరు. కాబట్టి ఇప్పుడు వశిష్ట డైరెక్ట్ చేస్తున్న సినిమానే ముందుగా విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగానే లేటెస్ట్‌గా ఆ ప్రాజెక్టును మెగా 156 అని ఒక పోస్టర్‌ను(Poster) దర్శకుడు వశిష్ట షేర్ చేశారు. మెగాస్టార్- వశిష్ట ఈ క్రేజీ ప్రాజెక్టులో సంగీత దర్శకత్వం బాధ్యతలను ఎమ్.ఎమ్.కీరవాణి(MM Keeravani) తీసుకున్నారు.
సాయి మాధవ్ బుర్ర మాటలు అందిస్తుంటే, చోటా కె.నాయుడు కెమెరామన్‌గా ఉన్నారు. మెగా 156 సినిమాకు సొగ్గాడే చిన్నినాయన దర్శకుడు కల్యాణ్ కృష్ణ రూపొందించబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధమయ్యిందని, త్వరలో ఆ దర్శకుడిని చిరంజీవినే అధికారికంగా ప్రకటిస్తాడని అనుకున్నారు. అయితే దసరా రోజున అభిమానులకు చిరంజీవి ఓ న్యూస్ చెప్పాడు. తన లైన్‌లో మెగా 156 లేదని తెలిపాడు. మెగా 157గా తెరకెక్కుతున్న వశిష్ట సినిమానే మెగా 156గా మార్చినట్టు చిరంజీవి తెలిపాడు. దీంతో మెగా 156 పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.