హిట్టుకొట్టిన డైరెక్టర్‌కే స్టార్ హీరోలు ఛాన్సులిస్తారు. ప్రొడ్యూసర్లు కూడా వారినే నమ్ముతుంటారు. ఇది సహజం! పోయిపోయి ఫ్లాప్ దర్శకులకు కాల్షీట్లు ఇవ్వరు కదా! గతంలో అజ్జాతవాసి సినిమా అప్పుడేం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ తర్వాత దర్శకుడు తివ్రికమ్ శ్రీనివాస్ చాన్నాళ్లపాటు బయట కనిపించలేదు. ఎవరూ త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లలేదు. ఆ సమయంలోనే ఎన్టీఆర్(Jr.NTR) ఆయనకు ధైర్యం చెప్పారు. అరవింద సమేతలో(Arvindha Sametha) నటించాడు.
హిట్టుకొట్టిన డైరెక్టర్‌కే స్టార్ హీరోలు ఛాన్సులిస్తారు. ప్రొడ్యూసర్లు కూడా వారినే నమ్ముతుంటారు. ఇది సహజం! పోయిపోయి ఫ్లాప్ దర్శకులకు కాల్షీట్లు ఇవ్వరు కదా! గతంలో అజ్జాతవాసి సినిమా అప్పుడేం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ తర్వాత దర్శకుడు తివ్రికమ్ శ్రీనివాస్ చాన్నాళ్లపాటు బయట కనిపించలేదు. ఎవరూ త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లలేదు. ఆ సమయంలోనే ఎన్టీఆర్(Jr.NTR) ఆయనకు ధైర్యం చెప్పారు. అరవింద సమేతలో(Arvindha Sametha) నటించాడు. ఆ సినిమా నిజంగానే త్రివిక్రమ్‌కు(Trivikram) ఓ టానిక్‌లా పని చేసింది. మళ్లీ స్టార్ డైరెక్టరయ్యాడు. బిజీ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్‌కు అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. అజ్ఞాతవాసి అంత కాకపోయినా గుంటూరుకారం సినిమా పోయిందనే చెప్పుకోవాలి.
సీడెడ్, నైజాం, కర్నాటక, ఓవర్‌సీస్‌లలో బయ్యర్లకు నష్టాలను మిగిల్చిన ఈ సినిమాను హిట్ అని చెప్పలేం. ఈ సినిమా రిజల్ట్స్ తర్వాత త్రివిక్రమ్ మళ్లీ సైలెంటయ్యాడు. అప్పటిలాగే ఎవరినీ కలవడం లేదట! సినిమా ఫ్లాప్ అయితే ఇలాంటి వైరాగ్యం ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. గుంటూరుకారం సినిమాకు సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు త్రివిక్రమ్‌నే తప్పుపడుతున్నారు. మహేశ్‌బాబు యాక్షన్‌కు ఏ వంకా లేదని అంటున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ నెక్ట్స్ పిక్చర్ ఏంటి? అల్లు అర్జున్‌తో(Allu Arjun) సినిమా తీస్తాడా? లేక మిడ్ రేంజ్ హీరోలతో సినిమా తీసి తానేమిటో ప్రూవ్ చేసుకుంటాడా? నిర్మాత స్రవంతి రవికిశోర్ చాన్నాళ్ల నుంచి సినిమా తీసిపెట్టమని అడుగుతున్నాడు. హీరో రామ్‌కు సరిపడా స్క్రిప్ట్‌ను రెడీ చేయాల్సిందిగా కోరుతున్నాడు.
స్రవంతి రవికిశోర్‌తో (sravanti Ravi kishore)త్రివిక్రమ్‌కు సాన్నిహిత్యం ఉంది. స్రవంతి కోరిక మన్నిస్తాడా? సితారా దగ్గర విజయ్ దేవరకొండ డేట్స్ రెడీగా ఉన్నాయట! మరి విజయ్‌తో సినిమా చేస్తాడా? నాని-త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పట్నుంచో ఊరిస్తూ వస్తోంది. అదేమన్నా వర్క్‌అవుటవుతుందా? ఇవేవి కాదని, ఎన్టీఆర్‌తో(NTR) సినిమా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. నిజానికి గుంటూరుకారం సినిమాకు ముందే ఎన్టీఆర్-తివ్రిమ్ సినిమా ఉండాలి. కానీ హీరిక-హాసిని సంస్థకు, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థకు అండర్‌స్టాండింగ్ కుదరలేదు. దాంతో ఆ ప్రాజెక్ట్ రద్దు అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దేవర మొదటి భాగం పూర్తికాగానే బాలీవుడ్ సినిమా వార్-2లో నటిస్తాడు. ఏప్రిల్ వరకు ఈ రెండు సినిమాలను కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రశాంత్ నీల్ సలార్-2 సినిమాపై కాన్‌సంట్రేట్ చేస్తున్నాడట! ప్రశాంత్ నీల్ కనుక సలార్-2కు కమిట్ అయితే ఎన్టీఆర్ ఖాళీ అవుతాడు. ఈ సమయాన్ని త్రివిక్రమ్‌కు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.