ప్రతిచోటా పడనివారు కొందరుంటారు.
ప్రతిచోటా పడనివారు కొందరుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి జాడ్యం ఎక్కువగా ఉంటుంది. మేలు కోరే వారు తక్కువగా ఉంటారు. నాశనం అవ్వాలని కోరుకునే వారే ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) అంటే పడనివారు ఇండస్ట్రీలో ఎక్కువయ్యారు. అందులో నిర్మాతలున్నారు, హీరోలున్నారు, సంగీత దర్శకులు కూడా ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఏకమయ్యారు. వారందరినీ ఏకం చేసింది పూనమ్ కౌర్(Poonam kaur) వివాదం! త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ పూనమ్ కౌర్ ట్వీట్ చేయగానే చాలా మంది ఆమెను సంప్రదించారు. కోర్టులో(Court) కేసు వేయమని సలహా ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయమని కొందరు సూచించారు. కంప్లయింట్ ఇస్తే మిగతాది తాము చూసుకుంటామని పూనమ్ కౌర్‌కు చెప్పారు. సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే తమకు ఇవ్వాలని కొందరు అడిగారట! ఇదే సమయంలో త్రివిక్రమ్ సైడు నుంచి కూడా కొందరు పూనమ్ కౌర్‌ను కలిశారు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలని అడిగారు. రాజీకొస్తే ఏం కావాలన్నా ఇస్తామన్నారు. పూనమ్ కౌర్ మాత్రం అనాలోచిత నిర్ణయాలు తీసుకోడానికి సిద్ధంగా లేరు.