టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు ప్రముఖులు కలిసి సినిమా నిర్మాణం చేపట్టబోతున్నారనే వార్త ఒకటి ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. దర్శక రచయిత త్రివిక్రమ్‌(Trivikram) చాన్నాళ్ల నుంచి నిర్మాణ రంగంలో ఉన్నారు. ఆయన సొంతంగా బ్యానర్‌ పెట్టి సినిమాలు నిర్మిస్తారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. తదనంతర కాలంలో ఆయన ఫార్ట్యూన్‌ ఫోర్‌(Fortune Four) అనే బ్యానర్‌ను స్థాపించి దాన్ని సితార సంస్థకు(Sitara entertainment) అనుసంధానం చేశారు.

టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు ప్రముఖులు కలిసి సినిమా నిర్మాణం చేపట్టబోతున్నారనే వార్త ఒకటి ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. దర్శక రచయిత త్రివిక్రమ్‌(Trivikram) చాన్నాళ్ల నుంచి నిర్మాణ రంగంలో ఉన్నారు. ఆయన సొంతంగా బ్యానర్‌ పెట్టి సినిమాలు నిర్మిస్తారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. తదనంతర కాలంలో ఆయన ఫార్ట్యూన్‌ ఫోర్‌(Fortune Four) అనే బ్యానర్‌ను స్థాపించి దాన్ని సితార సంస్థకు(Sitara entertainment) అనుసంధానం చేశారు. అంటే సితార సంస్థ నిర్మించే ప్రతి సినిమాలోనూ ఫార్ట్యూన్‌ ఫోర్‌ భాగస్వామిగా ఉంటున్నదన్నమాట! ఇక రెండో వ్యక్తి ఎవరంటే వివేక్‌ కూచిభొట్ల(Vivek Kuchibhotla). చాన్నాళ్లుగా ఈయన పీపుల్స్‌ మీడియాలో(Peoples media) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థ నుంచి వివేక్‌ బయటకు వచ్చేస్తారని అంటున్నారు. త్రవిక్రమ్‌తో కలిసి సినిమాలు నిర్మించడానికే పీపుల్స్‌ మీడియా నుంచి ఆయన బయటకు వస్తున్నారని అనేవారు కూడా ఉన్నారు. ఇక మూడో వ్యక్తి ప్రసిద్ధ సంగీత దర్శకుడు థమన్‌(Thaman). త్రివిక్రమ్‌తో థమన్‌కు మంచి బాండింగ్‌ ఉంది. వివేక్‌ నిర్మాతగా త్రివిక్రమ్‌- థమన్‌ భాగస్వాములుగా సినిమాలు నిర్మించబోతున్నారనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. టాప్‌ స్టార్లందరితోనూ వివేక్‌కు సాన్నిహిత్యం ఉంది. ఆయన కనుక సినిమాలు నిర్మిస్తే సహకరించడానికి చాలా మంది హీరోలు ముందుకొస్తారు. అయితే త్రివిక్రమ్‌కు సితార, హారిక హాసిని సంస్థలతో ఉన్న అనుబంధం అలాగే ఉంటుదని, ఫార్ట్యూన్‌ సంస్థను వివేక్‌ స్థాపించబోయే బ్యానర్‌కు కూడా జత చేస్తారని అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు రియాక్టయితే తప్ప గట్టిగా చెప్పలేం. కాకపోతే వివేక అప్పుడప్పుడు త్రివిక్రమ్‌ను కలుస్తుండటంతోనే అనుమానాలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే వినోదా సంస్థ గుర్తుకొస్తుంది. దేవదాసు నిర్మించింది ఈ సంస్థనే. వినోదా బ్యానర్‌ను నిర్మాత డి.ఎల్‌.నారాయణ, రచయిత-దర్శకుడు సముద్రాల రాఘవాచార్య, సంగీత దర్శకుడు సి.ఆర్‌.సుబ్బరామన్‌, దర్శకుడు వేదాంతం రాఘవయ్య కలసి స్థాపించారు.

Updated On 29 March 2024 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story