ఉదయ్‌కిరణ్(Uday Kiran) మరణంపై ఇప్పటికీ అనుమానాలెన్నో ఉన్నాయి. ఆయనది బలవన్మరణమే అయినప్పటికీ ఆ మరణం వెనుక ఉన్న చీకటి కోణాలు వెలుగులోకి రావాల్సి ఉంది. దర్శకుడు తేజ(Teja) చెబుతున్నట్టు చాలా మందికి ఉదయ్‌కిరణ్ మరణం వెనుక అసలు కారణం తెలుసు.
ఉదయ్‌కిరణ్(Uday Kiran) మరణంపై ఇప్పటికీ అనుమానాలెన్నో ఉన్నాయి. ఆయనది బలవన్మరణమే అయినప్పటికీ ఆ మరణం వెనుక ఉన్న చీకటి కోణాలు వెలుగులోకి రావాల్సి ఉంది. దర్శకుడు తేజ(Teja) చెబుతున్నట్టు చాలా మందికి ఉదయ్‌కిరణ్ మరణం వెనుక అసలు కారణం తెలుసు. తేజ దర్శకత్వం వహిస్తున్న అహింస(Ahimsa) సినిమా వచ్చే నెల రెండున విడుదల కానుంది. ఈ సినిమాలో దగ్గుబాటి అభిరామ్(Abhiram Daggubati) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గీతా తివారి(Geetha Thiwari) హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో తేజ బిజీబిజీగా ఉంటున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందరూ తేజను అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించే ఆయనను ఎక్కువ మంది అడుగుతున్నారు. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్‌కిరణ్ పేరు చెప్పగానే ఒక్కసారిగా పాపం అని అన్నాడు తేజ. మీరు ఉదయ్‌కిరణ్ డెత్ మిస్టరీని రివీల్ చేస్తానన్నారు కదా సర్. ఇప్పటి వరకు ఆ విషయం ఎందుకు చెప్పడం లేదని ఓ వ్యక్తి తేజను అడిగాడు. దానికి తేజ సమాధానమిస్తూ ' ఉదయ్‌కిరణ్ మరణం వెనుక కారణం చాలామందికి తెలుసు. కానీ నాతోనే ఎందుకు దాన్ని చెప్పించాలని చూస్తున్నారు.
అందరూ ఏమీ తెలియనట్టుగా, అమాయకంగా మీరే చెప్పండంటూ ఎందుకు నటిస్తున్నారో అర్థం కావడం లేదు' అని అన్నారు తేజ. ఆ తర్వాత తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు తేజ. వాళ్ల అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడట. తర్వలోనే అతడిని తేజ హీరోగా పరిచయం చేస్తారట. అమ్మాయి గురించి చెబుతూ ' ఆమె తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేసింది. ఆమెకు నేను పెళ్లి చేయను. నచ్చినవాడిని చూసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. తర్వాత దగ్గరివాళ్లను పిలిచి భోజనాలు పెడదామన్నాను. ఒకవేళ పెళ్లి తర్వాత అతడు నచ్చకపోతే విడాకులిచ్చేయమని చెప్పాను. నా ఇద్దరు పిల్లలకు ఇదే చెప్పాను. జీవితంలో సంతోషంగా ఉండటం కోసం ఏది చేయాలనిపిస్తే అది చేయండి. అంతేకానీ పక్కవాళ్లు ఏమనకుంటారోనని ఆలోచించకూడదని చెప్తాను' అని తేజ అన్నారు.