ఆర్ఆర్ఆర్(RRR) సినిమా తర్వాత రాజమౌళి క్షణం తీరిక లేకుండా గడిపారు. సినిమా ప్రమోషన్ కోసం చాలా కష్టపడ్డారు. అలాగే ఆస్కార్ అవార్డుల వేడుకల నేపథ్యంలో మూడు నెలల పాటు విదేశాల్లోనే ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కాసింత విశ్రాంతి తీసుకుంటున్నారు. కుటుంబసభ్యలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. గత నెల రోజులుగా తమిళనాడులోని(Tamil Nadu) సుందరమైన పర్యాటక ప్రాంతాలలో సేద తీరుతున్న రాజమౌళి అక్కడి సుప్రసిద్ధ ఆలయాలను(Temples) దర్శించారు.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా తర్వాత రాజమౌళి క్షణం తీరిక లేకుండా గడిపారు. సినిమా ప్రమోషన్ కోసం చాలా కష్టపడ్డారు. అలాగే ఆస్కార్ అవార్డుల వేడుకల నేపథ్యంలో మూడు నెలల పాటు విదేశాల్లోనే ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కాసింత విశ్రాంతి తీసుకుంటున్నారు. కుటుంబసభ్యలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. గత నెల రోజులుగా తమిళనాడులోని(Tamil Nadu) సుందరమైన పర్యాటక ప్రాంతాలలో సేద తీరుతున్న రాజమౌళి అక్కడి సుప్రసిద్ధ ఆలయాలను(Temples) దర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను(videos) సోషల్ మీడియాలో(Social media) షేర్ చేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర తనకు మరపురాని మధురానుభూతులను మిగిల్చిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. రోడ్డు ట్రిప్ ద్వారా తమిళనాడులోని దేవాలయాలను సందర్శించాలన్నది తన కల అని, గత నెలలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీరంగం, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, తూత్తుకుడి, మధురై దేవాలయాలను సందర్శించామని తెలిపారు. ఇక్కడి దేవాలయాల్లోని శిల్పకళా నైపుణ్యం, అద్భుతమైన కట్టడాలు నన్ను మంత్రముగ్ధుణ్ణి చేశాయన్నారు. చోళ రాజులు కళలను ఎంతగా ప్రోత్సహించారో ఈ దేవాలయాలను చూస్తే అర్థమైందని, రామేశ్వరం, కుంభకోణంలోని హోటల్స్‌లో భోజనాన్ని కూడా ఎంతగానో ఆస్వాదించామని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం మహేశ్‌బాబు కథనాయకుడిగా రాజమౌళి ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇది గ్లోబ్ ట్రొటింగ్ సినిమా అని అన్నారు. అడ్వెంచరస్ తరహా స్టోరీ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇలా రాజమౌళి-విజయేంద్ర ప్రసాద్ మాటలు బట్టి చూస్తుంటే ఇది ఇండియానా జోన్స్ తరహా జంగిల్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. అలాగే ఆర్‌ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇటీవల ప్రకటించిన రాజమౌళి అందుకు సంబంధించిన కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.