ప్రస్తుతం ఇండియాలో ఎలాంటి సినిమా అయినా తియ్యాలి అంటే అది దర్శకుడు రాజమౌళికే సాధ్యం అని అభిప్రాయం ఉంది అందరిలో. తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న సినిమా అంటే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరికి ఇష్టమే. ఈక్రమంలోనే చాలా మంది పెద్దవారు జక్కన్నతో తమ అభిప్రయాలు పంచుకున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త .. ఆనంద్ మహేంద్ర కూడా రాజమౌళికి ఓ చిన్ సలహా ఇచ్చారు.

ప్రస్తుతం ఇండియాలో ఎలాంటి సినిమా అయినా తియ్యాలి అంటే అది దర్శకుడు రాజమౌళికే సాధ్యం అని అభిప్రాయం ఉంది అందరిలో. తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న సినిమా అంటే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరికి ఇష్టమే. ఈక్రమంలోనే చాలా మంది పెద్దవారు జక్కన్నతో తమ అభిప్రయాలు పంచుకున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త .. ఆనంద్ మహేంద్ర కూడా రాజమౌళికి ఓ చిన్ సలహా ఇచ్చారు.

సామాజికంగా చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. సామాజిక సేవలో కూడా చురుగ్గా ఉంటారు ఆనంద్ మహేంద్ర. ఏ విషయంలో అయినా సొషల్ం మీడియా వేదికగా స్పందించడం ఆయనకు అలవాటు. ఆమధ్య ఆర్ఆర్ఆర్ ఆస్కార్ టైమ్ లో కూడా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు స్టెప్ వేశారు ఆనంద్ మహీంద్రా. ఇక ఈ దిగ్గజ పారిశ్రామిక వేత్త.. రాజమౌళికి ఓక కీలక కీలక సూచన కూడా చేశారు.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఇలాంటి హిస్టారికల్ సినిమాలు చేయడం.. తో పాటు సక్సెస్ అవ్వడం కూడా రాజమౌళికి మాత్రమే సాధ్యం అని అందరికి తెలిసిపోయింది. ఇక ఆయన దర్శక ప్రతిభను యావత్ దేశంతోపాటు ప్రపంచానికి చాటి చెప్పడంతో ఈ విషయంలో ఆనంద్ మహీంద్రా ఓ ముఖ్యమైన సూచన చేశారు. ఆయన మనసులో ఉన్నఓ ఆలోచనను రాజమౌళితో శేర్ చేసుకున్నారు ఆనంద్ మహేంద్ర.

సింధు నాగరికత గురించి అందరికి తెలిసిందే.. సింధు నాగరికత అలియాస్ ఇండస్ వాలీపై ఓ సినిమా చేయాలని రాజమౌళికి ఆనంద్ మహీంద్రా కోరారు. హరప్ప, మొహెంజో దారో, దోలావిరా, లోతాల్, కాలిబంగన్, బనావలి, రాఖిగర్హి, సుర్కోటడ, చన్హుదారో, రూపర్ తదితర ప్రాంతాల గొప్ప ప్రాచీన నాగరికతకు నిదర్శనాలుగా నిలుస్తాయి. అందుకే వీటికి సబంధించిన ఓ సినిమా వస్తే బాగుంటుంది అని ఆయన కోరారు. అంతే కాదు ఆయన చెప్పిన నాగరికతలకు సంబంధించిన ఒక్కో పెయిటింగ్ ఫొటోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఇలాంటి అద్భుతమైన ఎక్జాంపుల్స్.. చరిత్రకు ప్రాణం పోస్తాయని.. వాటిని సజీవంగా ఉంచుతాయని.. అంతే కాదు అవి మరుగున పడకుండా.. చురుగ్గా ఉంచుతాయంటూ.. ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారు. వాటిపై సినిమా చేయడాన్ని ఎస్ఎస్ రాజమౌళి ఆలోచిస్తే మంచిదని అన్నారు. అంతే కాదు ప్రాచీన నాగరికతపై ఇప్పటి వారికి కూడా అవగాహన వస్తుందన్నారు. ఆనంద్ మహేంద్ర ట్విట్ కు వెంటనే స్పందించారురాజమౌళి.

ఆనంద్ మహేంద్ర ట్వీట్ కు రాజమౌళి వెంటనే స్పందించారు.. అవును సర్. దోలావియాలో మగధీర సినిమా చిత్రీకరణ సందర్భంగా చాలా పురాతనమైన చెట్టును చూశాను. అది శిధిలంగా మారింది. సింధు నాగరికత వర్ధిల్లడం, పతనం కావడానికి ఆ చెట్టు నిదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత పాకిస్థాన్ కు కూడా వెళ్లాను. మొహెంజోదారోను సందర్శించేందుకు ఎంతో ప్రయత్నించాను, కానీ అక్కటి ప్రభుత్వం నాకు పర్మీషన్ ఇవ్వలేదు. అని రాజమౌళి ఆనంద్ మహీంద్రా సూచనకు బదులిచ్చారు. దాంతో ఈ ట్వీట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అటు నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది అయితే ఆనంద్ మహేంద్ర చెప్పినట్టు ఆ సినిమాను ఎలాగైన చేసి చూపించండి అంటూ రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న రాజమౌళి..నెక్ట్స్ మహేష్ సినిమాకు ప్రీ పొడక్షన్ వర్క్ లో ఉన్నారు.

Updated On 1 May 2023 5:34 AM GMT
Ehatv

Ehatv

Next Story