ఈమధ్య మన తెలుగు సినిమాల్లో తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎక్కువైపోయారు. అదులోను స్టార్ డైరెక్టర్లుగా పేరుతెచ్చుకున్న చాలా మంది నటులుగా మారి...మంచి మంచి రోల్స్ కొట్టేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని(Nani) సినిమాలో కూడా తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ జే సూర్య(SJ Surya) నటించబోతున్నట్టు ప్రకటన వెలువడింది.

ఈమధ్య మన తెలుగు సినిమాల్లో తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎక్కువైపోయారు. అదులోను స్టార్ డైరెక్టర్లుగా పేరుతెచ్చుకున్న చాలా మంది నటులుగా మారి...మంచి మంచి రోల్స్ కొట్టేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని(Nani) సినిమాలో కూడా తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ జే సూర్య(SJ Surya) నటించబోతున్నట్టు ప్రకటన వెలువడింది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ మధ్య ఎక్కువగా ప్రయోగాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు నాని.. అంతే కాదు... కొత్త దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. చాలా మంది దర్శకులకు లైఫ్ ఇస్తున్నాడు నేచురల్స్ స్టార్. ఈమద్యే దసరా(Dasara) సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నాని.. తన 30వ సినిమా డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌(Shauryav) దర్శకత్వంలో చేస్తున్నాడు. హాయ్‌ నాన్న(Hi Nana) టైటిల్ తో కూతురు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈమూవీ సెట్స్‌పై ఉండగానే నాని కొత్త సినిమా నాని 31(Nani 31) అప్‌డేట్ కూడా వచ్చేసింది. ఈ మూవీని వివేక్ ఆత్రేయ(Vivek Athreya) డైరెక్షన్‌లో చేస్తున్నాడు నాని. ఇప్పటికే ఈ మూవీ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాన నిర్మిస్తుండగా.. తాజాగా మేకర్స్ బారీ అప్డేట్ నుఅందించారు. ఈ మూవీలో టాలెంటెడ్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ముందుగా వచ్చినట్టుగానే అఫీషియల్‌ అప్‌డేట్ వచ్చేసింది. ఎస్‌జే సూర్యకు టీంలోకి స్వాగతం పలుకుతూ.. నాని అండ్‌ నాని అండ్ మేకర్ష్‌ టీం అధికారిక ప్రకటనను అందరితో షేర్ చేసుకున్నారు‌.

ఇక ఇందులో ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించబోతున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.హాయ్ నాన్న డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన పాటలు, టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. హాయ్ నాన్న మూవీలో మృణాళ్‌ ఠాకూర్(Mrunal Thakur) యశ్న పాత్రలో నటిస్తోంది.

Updated On 24 Oct 2023 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story