ఆర్ఆర్‌ఆర్‌(RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్‌(NTR) నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ట్రిపులార్‌ తర్వాత వస్తున్న ఎన్టీఆర్‌ సినిమా ఇదే కాబట్టి దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి పెరిగింది.

ఆర్ఆర్‌ఆర్‌(RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్‌(NTR) నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ట్రిపులార్‌ తర్వాత వస్తున్న ఎన్టీఆర్‌ సినిమా ఇదే కాబట్టి దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి పెరిగింది. తాజా షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ఎన్టీఆర్‌- సైఫ్‌ అలీఖాన్‌(Saif Alikhan) మధ్య వచ్చే ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్‌ నమ్మకంతో చెబుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సముద్రం బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్(Flash back) ఎపిసోడ్‌ కథకు ఆయువుపట్టులా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న టాక్‌. విజువల్‌గా కూడా ఈ ఎపిసోడ్‌ను అద్భుతంగా డిజైన్‌ చేయబోతున్నారని చెబుతున్నారు. విస్మరణకు గురైన ఈ తీరప్రాంతం. అక్కడ తన మనుషులను రక్షించుకోవడానికి కథనాయకుడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్‌, కొనరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

Updated On 25 July 2023 3:54 AM GMT
Ehatv

Ehatv

Next Story