అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. ఎక్మో సాయంతో చికిత్స అందించారు. కానీ పరిస్థితి చేయిదాటిపోయింది. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్‌. దర్శకుడే కాదు, నిర్మాత కూడా. కథ, స్క్రీన్‌ప్లేలలో దిట్ట.

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి పేరు ప్రఖ్యాతులను గడించిన సిద్ధిఖీ(Director Siddique) కన్నుమూశారు(Death). 63 ఏళ్ల సిద్ధిఖీ గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. మలయాళంలో ఎన్నో హిట్లను ఇచ్చిన సిద్ధిఖీ మరణం పట్ల మోహన్‌లాల్‌, కీర్తి సురేశ్‌, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవాతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిఖీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం సిద్ధిఖీకి గుండెపోటు వచ్చింది. వెంటనే కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. లివర్‌ సంబంధిత సమస్యలతో పాటు న్యూమోనియా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. ఎక్మో సాయంతో చికిత్స అందించారు. కానీ పరిస్థితి చేయిదాటిపోయింది. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్‌. దర్శకుడే కాదు, నిర్మాత కూడా. కథ, స్క్రీన్‌ప్లేలలో దిట్ట. మోహన్‌లాల్‌కు బెస్ట్‌ ఫ్రెండ్‌. సిద్ధిఖీ తీసిన తొలి సినిమా పప్పన్‌ ప్రియపెట్ట పప్పన్‌లో మోహన్‌లాలే హీరో. అలాగే చివరి చిత్రం బిగ్‌ బ్రదర్‌లో కూడా మోహన్‌లాలే హీరో. మెగాస్టార్‌ చిరంజీవి గ్రేట్‌ కమ్‌బ్యాక్‌ చిత్రం హిట్లర్‌ గుర్తింది కదా! దానికి కథ అందించింది సిద్ధిఖే. మలయాళంలో మమ్మట్టితో తీసిన హిట్లర్‌ను తెలుగులో చిరంజీవి చేశారు. అలాగే పలు భాషలలో రీమేక్‌ అయిన బాడీగార్డ్‌ ఒరిజినల్‌ డైరెక్టర్‌ కూడా ఈయనే! తెలుగులో నితిన్‌తో మారో అనే సినిమా తీశాడు కానీ అది విజయవంతం కాలేదు. సిద్ధిఖీ లేకపోవడం ఇండస్ట్రీకి తీరని లోటు!

Updated On 9 Aug 2023 7:54 AM GMT
Ehatv

Ehatv

Next Story