డైరెక్టర్ శంకర్...టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. పొలిటికల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈసినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా ఆద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో గేమ్ ఛేజంర్ పై భారీ అంచనాలున్నాయి.

గేమ్ ఛేంజర్(Game changer) కోసం భారీ స్కెచ్ వేశాడు డైరెక్టర్ శంకర్(Shankar). శంకర్ సినిమాలంటేనే భారీ బడ్జెట్.. భారీగా పాటలు.. సెట్లు.. క్లైమాక్స్ ఇంకా అదిరిపోతుంది. ఈక్రమంలోనే గేమ్ చేంజర్ క్లైమాక్స్ కోసం శంకర్ భారీ ప్లాన్ చేశాడట.

డైరెక్టర్ శంకర్...టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. పొలిటికల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈసినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా ఆద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో గేమ్ ఛేజంర్ పై భారీ అంచనాలున్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది..అటు ఇండియన్ 2(Indian-2) సినిమా షూటింగ్ తో పాటు.. గేమ్ ఛేంజర్ ను కూడా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శంకర్.

ఈ ఏడాది 2023 చివరికల్లా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక తాజాగా ఈమూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్స్‌(Climax fights) కోసం శంకర్ భారీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 500 మంది ఫైటర్లతో రామ్ చరణ్ పోరాట సన్నివేశాలు తీశారట. ఈ యాక్షన్ సీక్వెల్స్‌ తెలుగు సినిమాలో మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయన్న టాలీవుడ్ టాక్. వీటికోసం భారీగా బడ్జెట్ కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ వచ్చే వారం మొదలవనుంది.

ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్(Dual role) లో కనిపించబోతున్నారట. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుండటంతో.. సినిమాగురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50వ సినిమాగా గేమ్ ఛేంజర్ రూపుదిద్దుకుంటోంది. దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని . ఈసినిమాలో అంజలి, ఎస్ జే సూర్య, సునిల్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ వరకూ ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన తో సినిమా చేయబోతున్నారు.

Updated On 5 Aug 2023 11:06 PM GMT
Ehatv

Ehatv

Next Story