సినిమాల కోసం టెక్నాలజీని వాడటంలో శంకర్ తర్వాతే ఎవరైనా. అద్భుతాలను నిజాలుగా చేసి చూపిస్తాడు స్టార్ డైరెక్టర్. జీన్స్ సినిమా దగ్గర నుంచి రోబో వరకూ ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలిసిందే. ఈసారి అంతకు మించి అద్భుతం చూపించడానికి రెడీ అవుతున్నాడు జీనియస్ దర్శకుడు. ఆయన సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్, సీజి వర్క్‌తో తెరకెక్కిన పాటలు లెక్క లేనన్నున్నాయి. కాగా తాజాగా శంకర్ తన కొత్త సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తుంది.
ఇండియన్ 2 సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు శంకర్. ఈసారి ఏకంగా చనిపోయిన వారిని స్క్రీన్ మీదకు తీసుకురాబోతున్నాడట. మరి అందులో నిజం ఎంత.?
సినిమాల కోసం టెక్నాలజీని వాడటంలో శంకర్ తర్వాతే ఎవరైనా. అద్భుతాలను నిజాలుగా చేసి చూపిస్తాడు స్టార్ డైరెక్టర్. జీన్స్ సినిమా దగ్గర నుంచి రోబో వరకూ ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలిసిందే. ఈసారి అంతకు మించి అద్భుతం చూపించడానికి రెడీ అవుతున్నాడు జీనియస్ దర్శకుడు. ఆయన సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్, సీజి వర్క్‌తో తెరకెక్కిన పాటలు లెక్క లేనన్నున్నాయి. కాగా తాజాగా శంకర్ తన కొత్త సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శంకర్ ఓ వైపు కమల్ హాసన్ తో ఇండియన్-2 మరోవైపు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే.. అయితే ఇండియన్ 2 మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది.. ఈసినిమాను ముందుగా రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు మేకరస్.
వచ్చే సంక్రాంతికి కాని.. అది మిస్ అయితే.. సమ్మర్ కు కాని ఈసినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇండియన్ 2 కోసం శంకర్ ఒ అద్భుతమైన ప్రయోగం చేయబోతున్నాడట. చనిపోయిన వాళ్ళను సాంకేతికత సహాయంతో తిరిగి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. దివంగత నటులు వివేక్, నెడుముడి వేణులు ఇండియన్-2 షూట్‌లో కొన్ని రోజులు పాల్గొన్నారు. ఇండియన్-2 స్టార్టింగ్ లో మొదటి షెడ్యూల్స్ లో వీరిపై కీలక సన్నివేశు చిత్రీకరించారు. అయితే అనుకోకుండా.. వారు కాలం చేయడంతో.. సినిమాలో వారితో చేయాల్సిన పెండింగ్ సీన్స్ పెండింగ్ పడిపోయాయట.
ఇక వారి స్థానంలో వేరేవాళ్లను పెట్టి సినిమా కంప్లీట్ చేయడం కుదిరే పని కాదు.. ఎక్కడిక్కడన నట్లు బిగించేసి ఉంచాడు శంకర్. దాంతో తన బుర్రకు పదును పెట్టాడు శంకర్ . అడ్వాన్స్ టెక్నాలజీని వాడి.. వారిని తెరపై బ్రతికించబోతున్నాడట. బాడీ డబుల్స్‌ని వాడి కొత్త తరహా హాలీవుడ్ టెక్నాలజీతో నిజంగా వాళ్ళు మళ్ళీ వచ్చారా అనిపించేలా శంకర్ తీయబోతున్నట్టు చెన్నై టాక్. గతంలో యమదొంగ సినిమాలో రాజమౌళి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఓ పాటలో వీఎఫ్‌ఎక్స్‌తో రెప్పపాటు కనిపించేలా చేశాడు. ఇక ఇప్పుడు శంకర్ ఏకంగా వాళ్లతో సీన్స్‌ను ప్లాన్ చేస్తున్నాడంటే విశేషమనే చెప్పాలి. నిజానికి చనిపోయిన వాళ్లను టెక్నాలజీతో సీన్స్ తెరకెక్కించడమనేది కత్తి మీద సామే.