ప్రముఖ దర్శకుడు శంకర్‌(Shankar) కూతురు అదితి శంకర్‌(Adithi Shankar) హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చారన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. స్టార్‌ హీరో కార్తీకి జోడిగా విరుమాన్‌ అనే సినిమాలో నటించారు. మొదటి సినిమాతోనే అదితి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత శివకార్తికేయన్‌()Shiva Karthikeyan హీరోగా వచ్చిన మావీరన్‌(Maveeran) సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. దాంతో అదితికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు శంకర్‌(Shankar) కూతురు అదితి శంకర్‌(Adithi Shankar) హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చారన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. స్టార్‌ హీరో కార్తీకి జోడిగా విరుమాన్‌ అనే సినిమాలో నటించారు. మొదటి సినిమాతోనే అదితి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత శివకార్తికేయన్‌()Shiva Karthikeyan హీరోగా వచ్చిన మావీరన్‌(Maveeran) సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. దాంతో అదితికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అదితి తల్లిదండ్రులకు ఆమెను డాక్టర్‌గా చూడాలనే కోరిక బలంగా ఉంది. తల్లిదండ్రుల కోరిక మేరకు అదితి మెడిసిన్‌ కూడా చదివారు. కాకపోతే అదితికి నటనంటే ఇష్టం కాబట్టే హీరోయిన్‌ అయ్యారు. నటనలో విజయాన్ని సాధించారు. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ డాక్టర్‌గా మారి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. కోటు వేసుకుని, గ్లౌజులు ధరించి, తలకు క్యాప్‌ పెట్టుకుని అచ్చంగా డాక్టర్‌లా కనిపిస్తున్నారు. ఈ ఫోఓను డాక్టర్‌ ఏ అన్న క్యాప్షన్తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు అదితి. డాక్టర్‌ ఏ అంటే డాక్టర్‌ అదితి శంకరేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇకపై సినిమాల్లో నటించరేమోనని సందేహపడుతున్నారు. కొంపతీసి ఈ డాక్టర్‌ వేషం సినిమా కోసం కాదుకదా అని కొందరు అంటున్నారు. డాక్టర్‌ గెటప్‌లో అదితిని చూసి అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

Updated On 18 Nov 2023 5:29 AM GMT
Ehatv

Ehatv

Next Story