సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని.. ముఖ్యంగా తమిళ పరిశ్రమను పరుగులు పెట్టించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేశాడు దశ్శకుడు శంకర్. 1993లో జెంటిల్‌ మెన్‌(Gentlemen) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శంకర్‌ షణ్ముగమ్‌(Shankar Shanmugam) మొదటి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. రికార్డ్ లతో బ్రేక్ చేశాడు. ఆ సినిమా మొదలు ప్లాప్ అన్న మాట తెలియని శంకర్.. వరుసగా.. భారతీయుడు, జీన్స్‌, ఒకే ఒక్కడు, బాయ్స్‌, శివాజీ.. ది బాస్‌, రోబో.. ఐ, లాంటి ఎన్నో అద్బుతమైన సినిమాలను అందించాడు. రకరకాల జానర్లలో సినిమాలు చేస్తూ.. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లాడు శంకర్.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మొదటి సారి హాలీవుడ్ రేంజ్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు శంకర్(Shankar). ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి మూడు దశాబ్ధాలు అవుతుంది. ఈసందర్భంగా ఘనంగా సెలబ్రేట్ చేశారు టీమ్.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని.. ముఖ్యంగా తమిళ పరిశ్రమను పరుగులు పెట్టించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేశాడు దశ్శకుడు శంకర్. 1993లో జెంటిల్‌ మెన్‌(Gentlemen) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శంకర్‌ షణ్ముగమ్‌(Shankar Shanmugam) మొదటి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. రికార్డ్ లతో బ్రేక్ చేశాడు. ఆ సినిమా మొదలు ప్లాప్ అన్న మాట తెలియని శంకర్.. వరుసగా.. భారతీయుడు, జీన్స్‌, ఒకే ఒక్కడు, బాయ్స్‌, శివాజీ.. ది బాస్‌, రోబో.. ఐ, లాంటి ఎన్నో అద్బుతమైన సినిమాలను అందించాడు. రకరకాల జానర్లలో సినిమాలు చేస్తూ.. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లాడు శంకర్.

ఇక శంకర్ తన ఫిల్మ్ కెరీర్ లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా జెంటిల్ మెన్ రిలీజ్ అయ్యి 30 ఏళ్లు అవుతుంది. 1993 ఏడాది జులై 30న ఈసినిమా రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టించింది ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా 30 ఏండ్ల సక్సెస్‌ఫుల్ జర్నీని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శంకర్‌ డైరెక్షన్‌ టీం ఆయనతో స్పెషల్ కేక్‌ కట్‌ చేయించింది. తమ గురువుకు కేక్‌ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన శిశ్యులు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

శంకర్ ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. తెలుగులో రామ్ చరణ్ తో.. గేమ్ చేంజర్ సినిమాచేస్తున్నారు శంకర్. అటు తమిళంలో తన సినిమా ఇండియన్ కు సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌ నెట్టింట హల్ చల్ చేస్తోంది.గేమ్‌ ఛేంజర్‌లో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తున్నాడు. కోలీవుడ్ బ్యూటీ తెలుగు పిల్ల అంజ‌లి మరో ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, జ‌య‌రాయ్‌, సునీల్ ఇత‌ర కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.

శంకర్‌ మరోవైపు యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్‌ రోల్‌లో ఇండియన్‌ 2 (Indian 2) కూడా తెరకెక్కిస్తున్నాడు.కాజల్ అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, సిద్దార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, స‌ముద్రఖని ఇత‌ర కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ ఇండియన్‌ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated On 30 July 2023 11:45 PM GMT
Ehatv

Ehatv

Next Story