పుష్ప సినిమా(Pushpa Movie)తో అల్లు అర్జున్(Allu Arjun) నేషనల్ హీరో అయ్యారు. ఒక్క సినిమాతోనే జాతీయస్థాయిలో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. బన్నీతో సినిమాలు తీయడానికి ఇప్పుడు దర్శక నిర్మాతలు క్యూలు కడుతున్నారు. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్లు(Bollywood Directers0 కూడా ఉన్నారట. పీరియాడిక్ సినిమాలతో నేమ్‌ను ఫేమ్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా లైన్‌లో ఉన్నారట.

Sanjay Leela Bhansali With Allu Arjun
పుష్ప సినిమా(Pushpa Movie)తో అల్లు అర్జున్(Allu Arjun) నేషనల్ హీరో అయ్యారు. ఒక్క సినిమాతోనే జాతీయస్థాయిలో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. బన్నీతో సినిమాలు తీయడానికి ఇప్పుడు దర్శక నిర్మాతలు క్యూలు కడుతున్నారు. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్లు(Bollywood Directers) కూడా ఉన్నారట. పీరియాడిక్ సినిమాలతో నేమ్‌ను ఫేమ్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా లైన్‌లో ఉన్నారట. అల్లు అర్జున్ మాత్రం తన కెరీర్‌ను చక్కగా బిల్డప్ చేసుకుంటున్నారు. సినిమాల విషయంలో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నారు. అవకాశం ఉన్న ఏ దర్శకుడినీ ఆయన వదిలి పెట్టడం లేదు. భన్సాలీని కూడా లైన్‌లో పెట్టారన్నది ఫిల్మ్ నగర్ టాక్. సంజయ్ లీలా భన్సాలీతో(Sanjay Leela Bhansali) సినిమా అంటే మామూలుగా ఉండదు. బాలీవుడ్‌లో సినిమా చేస్తున్నారంటే అది కచ్చితంగా పాన్ ఇండియా సినిమా(Pan India Movie)నే అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ తెలుగులో కూడా సినిమా చేసినట్టు అవుతుంది. ఇప్పటికే త్రివిక్రమ్, సురేందర్‌రెడ్డిలు లైన్‌లో ఉన్నారు. వీటి తర్వాత కానీ సంజయ్ లీలా భన్సాలీ సినిమా ఉండదు. ఒకవేళ స్క్రిప్ట్ పర్‌ఫెక్ట్‌గా వస్తే మాత్రం ఈయనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు!
