యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్‌ సినిమా మిగిల్చిన చేదు అనుభవాన్ని నుంచి బయటపడిన ప్రభాస్‌ తన తర్వాతి సినిమాలపై శ్రద్ధ పెట్టారు. సలార్‌(Salaar) సినిమా సెప్టెంబర్‌ 28న విడుదలవుతోంది. కల్కి 2898(Kalki 2898) సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్‌ స్పిరిట్‌(Spirit) అనే సినిమాను చేయబోతున్నారన్న విషయం తెలిసిందే.

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్‌ సినిమా మిగిల్చిన చేదు అనుభవాన్ని నుంచి బయటపడిన ప్రభాస్‌ తన తర్వాతి సినిమాలపై శ్రద్ధ పెట్టారు. సలార్‌(Salaar) సినిమా సెప్టెంబర్‌ 28న విడుదలవుతోంది. కల్కి 2898(Kalki 2898) సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్‌ స్పిరిట్‌(Spirit) అనే సినిమాను చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరాంతంలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ను నిర్మాతలు ఇచ్చారు. ఈ సినిమాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించనున్నారని ప్రొడ్యుసర్లు తెలిపారు. అర్జున్‌రెడ్డి సినిమాకు కూడా ఈయనే సంగీతాన్ని అందించారన్న విషయం తెలిసిందే. పోలీస్‌ డ్రామాగా తెరకెక్కనున్న స్పిరిట్‌ సినిమాను ఎనిమిది భాషల్లో విడుదల చేయబోతున్నారు.

ఇందులో ప్రభాస్‌ తొలిసారి పోలీస్‌(police) అధికారి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగా హిందీలో రణబీర్‌కపూర్‌తో యానిమల్‌ అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా పూర్తవగానే స్పిరిట్‌ను మొదలుపెడతారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. అయినప్పటికీ రాజా డీలక్స్‌(Raja delux) అనే పేరును ఖాయం చేశారనే ప్రచారం సోషల్‌ మీడియాలో జరుగుతోంది. తాజాగా వింటేజ్‌ కింగ్‌ అనే టైటిల్‌ని అనుకుంటున్నారనే వార్త వెలువడింది. ఇంతకీ రాజా డీలక్స్‌ని ఫిక్స్‌ చేశారా? లేక వింటేజ్‌ కింగ్‌ అనుకుంటున్నారా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Updated On 12 Aug 2023 8:03 AM GMT
Ehatv

Ehatv

Next Story