నిన్ననే( December 1) న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది యానిమల్ మూవీ(animal Movie). డ్యూరేషన్ ఎక్కువైనా.. ఏమాత్రం ఆలోచించకుండా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ సినిమాకు సబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో(Social media) తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..?

నిన్ననే( December 1) న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది యానిమల్ మూవీ(animal Movie). డ్యూరేషన్ ఎక్కువైనా.. ఏమాత్రం ఆలోచించకుండా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ సినిమాకు సబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో(Social media) తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..?

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌(Ranbir kapoor)- దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా యానిమల్‌. ఈమూవీపై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డిని మించి హిట్ అవుతుంది అనుకున్నారు అంతా. ఇక వాటికి తగ్గట్టే.. టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్స పెక్టేషన్స్ ను అమాంతం పెంచేశాయి. ఇక యానిమల్ ప్రీ బుకింగ్స్‌, థియేట్రికల్‌, ఓటీటీ రైట్స్‌(OTT Rights) విషయంలో రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ప్రీ బుకింగ్స్‌ విషయంలో ఓవర్‌ సీస్‌లో యానిమల్ దుమ్ము దులిపింది. ఏకంగా 6 మిలియన్ల ప్రీ బుకింగ్స్‌ను సాధించింది. ఇక, తెలుగునాట యానిమల్‌ను ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌ రాజు డిస్ట్రిబ్యూట్‌ చేశారు.

తాజాగా (డిసెంబర్ 1) రిలీజ్ అయిన యానిమల్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్లే బాయ్(Play boy) గా.. లవర్ బాయ్(Lover boy) గా బాలీవుడ్ లో ఫాలోయింగ్ ఉన్న రణ బీర్ కపూర్ ఫస్ట్ టైమ్ ఇంత మాస్ లుక్(Mass Look) లో కనిపించడం అందరికి కొత్తగా అనిపించింది. ఇక యానిమల్ లో మన్ మాన్ షో చేశాడు రణ్ బీర్.. పెర్ఫామెన్స్ తో ఉతికి ఆరేశాడు. దాంతో ఈమూవీ అంచనాలకు తగ్గట్టేఆడియన్స్ ను అలరిస్తోంది. ఇక యానిమల్ ఓటీటీ రిలీజ్ పై కూడా ఓ క్లారిటీ వచ్చేసినట్టు తెలుస్తోంది. ఈమూవీని నెట్ ప్లీక్స్(Netflix) లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నటుట సమాచారం.

ఇక ఇక్రమంలో యానిమల్ మూవీకి సబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. యానిమల్ సినిమాకుసీక్వెల్(Animal Sequel).. అవును ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈమద్య పెద్ద పెద్ద సినిమాలన్నీ రెండు పార్ట్ లుగా రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని మాత్రం రిస్క్ చేయకుండా..ఫస్ట్ ఓ సినిమా రిలీజ్ చేసి..రెస్పాన్స్ ను బట్టి సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు. ఈక్రమంలోనే యానిమల్ సినిమాకు కూడా సీక్వెల్ మూవీని త్వరలోప్రకటిస్తారని అంటున్నారు.

మొన్న జరిగిన ప్రీ రిలీజ్‌(Pre-release) ఈవెంట్‌లో సందీప్‌ మాట్లాడుతూ.. సినిమా క్లైమాక్స్‌ అస్సలు మిస్‌ అవ్వద్దని అన్నాడు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉండనుందన్న ప్రచారానికి బలం చేకూరింది. యానిమల్‌ ప్రేక్షకుల ముందుకు రావటం.. సినిమాకు సీక్వెల్‌ ఖరారు అవటం జరిగిపోయింది. మొదటి భాగమే దుమ్మ దులిపేయటంతో.. రెండో భాగం ఎలా ఉండనుందోనని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రెండో భాగానికి సంబంధించిన వివరాలు సందీప్‌ ఎప్పుడు చెబుతాడా? అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Updated On 3 Dec 2023 7:51 AM GMT
Ehatv

Ehatv

Next Story