హీరోయిన్ హన్సిక మోత్వానీ తెలుగులో చేసిన చిత్రాలు తక్కువే కానీ, తమిళంలో అగ్రశ్రేణి హీరోలతో నటించారు. ప్రియుడిని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె నటిస్తోన్న చిత్రం పార్ట్‌నర్. తమిళంలో ఈ సినిమా తెరకెక్కుతోంది
హీరోయిన్ హన్సిక మోత్వానీ (Hansika Motwani) తెలుగులో చేసిన చిత్రాలు తక్కువే కానీ, తమిళంలో అగ్రశ్రేణి హీరోలతో నటించారు. ప్రియుడిని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె నటిస్తోన్న చిత్రం పార్ట్‌నర్ (partner movie) . తమిళంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆది హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రోబో శంకర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరో కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కామెడీ, క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. చెన్నైలో నిర్వహించిన టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో రోబో శంకర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. హన్సిక మోత్వానీ తీరుపై విమర్శలు గుప్పించారు. 'ఈ మూవీ షూటింగ్‌లో ఒక సీన్ కోసం హన్సిక నా కాలును తాకాలి. కానీ ఆమె నా కాలును తాకేందుకు నిరాకరించింది. దర్శకుడు ఆమెను ఎంత బతిమిలాడినా ఆమె ఒప్పుకోలేదు. హన్సిక అలా ప్రవర్తించడం చూసి సెట్‌లో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఇక చేసేది లేక దర్శకుడు ఆ సన్నివేశం లేకుండానే షూటింగ్‌ను కంప్లీట్ చేశాడు' అని రోబో శంకర్ అన్నాడు. దీంతో రోబో శంకర్ (ROBO Shankar) చేసిన కామెంట్స్‌పై ఈవెంట్‌కు హాజరైన మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. మహిళా జర్నలిస్టులు దుమ్మెత్తిపోస్తున్నారు. రోబో శంకర్‌కు మర్యాద, వృత్తి నైపుణ్యం లేవంటూ ఆయన ప్రవర్తనను తప్పబట్టారు. స్టేట్‌పై ఒక హీరోయిన్ గురించి అలా మర్యాద లేకుండా మాట్లాడటం మంచి పద్దదతి కాదని ఫైర్ అవుతున్నారు. అయితే రోబో శంకర్ వ్యాఖ్యలపై ఆయన భార్య స్పందించారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. ఆయనకు జాండిస్ నిర్ధారణ అయిందని.. అందుకోసం చికిత్స పొందుతున్నాడని రోబో శంకర్ భార్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మానసికి పరిస్థితి బాగాలేదని ఆమె అన్నారు.