ఇప్పుడు మనం సోషల్ మీడియా(Social Media) యుగంలో ఉన్నాం. మనం ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సోయి లేకుండా ప్రవర్తిస్తే మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు ఏదైనా చేస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే చాలా కష్టం. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి(A.S Ravikumar Chowdhary).
ఇప్పుడు మనం సోషల్ మీడియా(Social Media) యుగంలో ఉన్నాం. మనం ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సోయి లేకుండా ప్రవర్తిస్తే మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు ఏదైనా చేస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే చాలా కష్టం. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి(A.S Ravikumar Chowdhary). ఇంతకు ముందు ఈయన యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. లేటెస్ట్‌గా ఈ దర్శకుడు ఓ పిచ్చి పని చేసి నెటిజన్ల తీవ్ర ఆగ్రమానికి గురయ్యాడు. ప్రస్తుతం రవికుమార్ చౌదరి తిరగబడరా సామి(Thiragabadara Swami) అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రాజ్ తరుణ్(Raj Tharun) హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మన్నారా చోప్రా(Manara Chopra) నటిస్తున్నారు. ఇంతకు ముందు ఈమె జక్కన్న, రోగ్ అనే సినిమాలలో నటించారు. కాగా ఈ సినిమా టీజర్ లాండ్ ఈవెంట్‌లో దర్శకుడు రవికుమార్ చౌదరి ఓ గలీజ్ పని చేశాడు.
హీరోయిన్ మన్నారా చోప్రాను మీడియా ముందే ముద్దు పెట్టుకున్నాడు. ఆ సమయంలో పాపం ఎలా రియాక్టవ్వాలో తెలియక మన్నారా చోప్రా నవ్వును తెచ్చిపెట్టుకున్నారు. ఆ విధంగా ఆ ఘటనను కవర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్‌లతో ఇలాంటి చిలిపి చేష్టలు చేయడం పద్దతి కాదని, ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదని అంటున్నారు. హీరోయిన్లు కూడా ఇలాంటి చేష్టలను చూసి చూడనట్టు వదిలేయకూడదని, వీటిపై గట్టిగా రియాక్టవ్వాలని సూచిస్తున్నారు.ఇలాంటి వాటిని గట్టిగా ప్రతిఘటించాలని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటివి గతంలో కూడా చాలానే జరిగాయి. ఓసారి సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు వేదిక మీదే కాజల్‌కు ముద్దు పెట్టాడు. అది కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. చివరికి కాజల్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే అలా చేశానంటూ చోటా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరీ ఎ.ఎస్. రవికుమార్ తను చేసిన పనిని సమర్థించుకుంటాడా? లేక సారీ చెబుతాడా? అన్నది చూడాలి.