డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు నేహా షెట్టి(Neha Shetty). ముంగురు మేల్‌ 2 అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీకి మొదటి సినిమా పేరును కానీ అవకాశాలను కానీ తెచ్చిపెట్టలేదు. రెండేళ్ల పాటు సినిమా అవకాశాల కోసం ఎదురుచూసింది. 2018లో మెహబూబా(Mehbooba) అనే తెలుగు సినిమాలో నటించింది. సినిమా విజయం సాధించలేదు. దాంతో ఇక్కడా అదే పరిస్థితి. మళ్లీ మూడేళ్ల వరకు ఆమెకు అవకాశాలే రాలేదు. అయితే డీజే టిల్లు(DJ Tillu) సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది.

డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు నేహా షెట్టి(Neha Shetty). ముంగురు మేల్‌ 2 అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీకి మొదటి సినిమా పేరును కానీ అవకాశాలను కానీ తెచ్చిపెట్టలేదు. రెండేళ్ల పాటు సినిమా అవకాశాల కోసం ఎదురుచూసింది. 2018లో మెహబూబా(Mehbooba) అనే తెలుగు సినిమాలో నటించింది. సినిమా విజయం సాధించలేదు. దాంతో ఇక్కడా అదే పరిస్థితి. మళ్లీ మూడేళ్ల వరకు ఆమెకు అవకాశాలే రాలేదు. అయితే డీజే టిల్లు(DJ Tillu) సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అందులో ఆమె చేసిన రాధిక పాత్ర ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. అటు తర్వాత నేహా చేసిన బెదురులంక 2012(Bedhurulanka 2012) సినిమా కూడా విజయవంతమయ్యింది. ప్రస్తుతం ఈ రాధిక రూల్స్‌ రంజన్‌(Rules Ranjan), గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి(Gangs Of Godhavari) సినిమాలు చేస్తోంది. రూల్స్‌ రంజన్‌ సినిమా వచ్చే నెల 6వ తేదీన విడుదల కానుంది. ఇందులో సమ్మోహనుడా అన్న పాట ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో హీరోయిన్‌తో దర్శకుడు రత్నం కృష్ణకు(Ratnam Krishna) గొడవఅయ్యిందట! దర్శకుడు ఏం చెబుతున్నారంటే 'సమ్మోహనుడా పాటలో స్విమ్మింగ్‌ పూల్‌ షాట్‌ ఒక్కటే మిగిలి ఉంది. ఆ నీళ్లలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు ఉంది. నేను షాట్‌కు అంతా సిద్ధం చేసుకున్నాను. ఆ నీళ్లలోకి వెళ్లి యాక్ట్‌ చేయమని చెప్తే.. నేహా రేపు పొద్దున నీవల్లే ఈ సమస్య వచ్చింది, నువ్వే చేయమన్నావ్‌ అంటుంది. అందుకని.. రివర్స్‌లో నువ్వు చేయొద్దులే అని చెప్పాను. నిజానికి అంత చల్లని నీళ్లలోకి తనను పంపించి షూట్‌ చేయడం అసలు కరెక్ట్‌ కాదు. షాట్‌ క్యాన్సల్‌ చేస్తానన్నాను. లేదు, నేను ప్రయత్నిస్తానంటూ తను నీళ్లలోకి దిగింది. చాలాసేపు పూల్‌లో ఉండటంతో క్లోరిన్‌ వాటర్‌ వల్ల తన మోకాలికి కొద్దిగా గాయమైంది. అప్పటికే అరగంటపైనే అయింది. నాకింకా రెండు,మూడు షాట్స్‌ తీయాల్సి ఉంది. తను త్వరగా తీయ్‌, త్వరగా తీయ్‌ అని అంటుంటే ఇంకో 5-10 నిమిషాలు ఓర్చుకో అని చెప్పాను. తను నా మాట వినకుండా ఆ నీళ్లలో నుంచి బయటకు వచ్చేసింది. ఇంకాసేపు ఉండుంటే ఆ రెండు షాట్స్‌ తీసేవాడిని కదా అని గొడవపడ్డాను. అలా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మూడు నెలల వరకు మాట్లాడుకోలేదు. తర్వాత సినిమా ఎడిటింగ్‌ చేసేటప్పుడు వాటర్‌ సీన్‌ చూసి చాలా బాధపడ్డాను. అరె.. ఎవరూ ఇలాంటి షాట్‌ తీయలేరు, ఇలా చేయలేరు అనుకున్నాను. నేహా షెట్టికి ఫోన్‌ చేసి మాట్లాడాను' అని రత్నం కృష్ణ అన్నాడు. నేహా కూడా ఈ షాట్‌ తర్వాత చాలా ఏడ్చాను అని తెలిపింది. ఓపక్క తను పడ్డ కష్టం, మరోపక్క షాట్‌ బాగా వచ్చిందన్న సంతోషంతో భావోద్వేగానికి లోనయ్యాయని చెప్పింది.

Updated On 22 Sep 2023 5:27 AM GMT
Ehatv

Ehatv

Next Story