నిజం నిర్భయంగా చెపుతాను అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). నిజం చెప్పడం కోసం.. అబద్దం బట్టలు ఊడదీయాలంటూ..నిజం పేరుతో ఓఛానల్ పెట్టబోతున్నట్టు ప్రకటించాడు. ఇక రామ్ గోపాల్ వర్మ వాయిస్ డైరెక్ట్ గా వినిపించడానికి రెడీ అయ్యాడు. దానికోసం సరికొత్త ప్లాట్ ఫామ్ కూడా రెడీ చేసుకున్నాడు. కాస్త డిఫరెంట్ గా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడేద్దాం అని అనుకున్నాడో ఏమో..

నిజం నిర్భయంగా చెపుతాను అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). నిజం చెప్పడం కోసం.. అబద్దం బట్టలు ఊడదీయాలంటూ..నిజం పేరుతో ఓఛానల్ పెట్టబోతున్నట్టు ప్రకటించాడు.

ఏదైనా ఒక విషయం తప్పు కాని.. ఒప్పు కాని.. కాన్ఫిడెంట్ గా తన వర్షన్ వినిపంచడంలో నెంబర్ వన్ గా ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఏదైనా విషయాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పే గట్స్‌ ఉన్న వ్యాక్తి అతను ఏదో ఒక వివాదాస్పద అంశం, సెటైరికల్‌ ట్వీట్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ.. అప్పుడప్పుడూ సామాజిక అంశాలు, సమకాలీన పరిస్థితుల మీద తన గళాన్ని వినిపిస్తుంటాడు, ఉదాహరణకు రీసెంట్ గా పిల్లడిని కుక్కలు చంపేసిన సంఘటనలో తన వాయిస్ గట్టిగా వినిపించాడు.

ఇక రామ్ గోపాల్ వర్మ వాయిస్ డైరెక్ట్ గా వినిపించడానికి రెడీ అయ్యాడు. దానికోసం సరికొత్త ప్లాట్ ఫామ్ కూడా రెడీ చేసుకున్నాడు. కాస్త డిఫరెంట్ గా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడేద్దాం అని అనుకున్నాడో ఏమో.. యూట్యూబర్ అవతారం ఎత్తబోతున్నాడు వర్మ. నిజం అనే పేరుతో యూట్యూబ్‌ ఛానల్ ను లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు వర్మ. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. నిజం ఛానల్‌లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్(Political controversies) మాత్రమే కాకుండా కొన్ని ప్రస్తుత పరిస్థితులు, సైన్స్, హిస్టరీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి.. అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇక ఈ ఛానల్ ఆరోజు( 25 ఏప్రిల్ ) సాయంత్రం 4 గంటలకు లాంఛ్‌ కాబోతుందని ట్వీట్ చేశాడు.అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి.. నిజాన్ని ఎవ్వరూ చంపలేరు. కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుంది. దానికి మోసపోయి,అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరం తో డాన్స్ లాడుతూండగా ఏదో ఒక రోజు వెనక నుంచి ముందు పోటు పొడుస్తుంది.. తన స్టైల్‌లో చెబుతూ ఛానల్‌ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్‌ చల్ చేస్తున్నాయి. మరి వర్మ అనుకుంటున్న నిజంలో నిజంగా నిజం ఉందా...? అది నిజమే అని ఆయన ఎలా చెప్పగలడు.. రానున్న రోజుల్లో వర్మ ఎలాంటి నిజనిజాలను బయటకు తీయబోతున్నాడు. ఒకవేళ తీసిన.. అవి నిజంగా నిజాలేనా అనేది చూడాలి.

Updated On 25 April 2023 2:12 AM GMT
Ehatv

Ehatv

Next Story