యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా కల్కి 2898(Kalki 2898). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వైజయంతి మూవీస్(Vyjayanthi Movies) పతాకంపై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రభాస్‌కు జోడిగా దీపిక పడుకొనే(Deepika Padukone) నటిస్తున్నారు. విలన్ పాత్రను కమలహాసన్(Kamal Hassan) పోషిస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. దీనికి అదిరిపోయే రీతిలో స్పందన వచ్చింది. హాలీవుడ్ రేంజ్‌లో విజువల్స్ ఉన్నాయని సినీ లవర్స్ అంటున్నారు. ఈ గ్లింప్స్‌పై దర్శకుడు రాజమౌళి(Rajamouli) కూడా ప్రశంసలు కురిపించారు.

Rajamouli In Kalki Movie
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా కల్కి 2898(Kalki 2898). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వైజయంతి మూవీస్(Vyjayanthi Movies) పతాకంపై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రభాస్‌కు జోడిగా దీపిక పడుకొనే(Deepika Padukone) నటిస్తున్నారు. విలన్ పాత్రను కమలహాసన్(Kamal Hassan) పోషిస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. దీనికి అదిరిపోయే రీతిలో స్పందన వచ్చింది. హాలీవుడ్ రేంజ్‌లో విజువల్స్ ఉన్నాయని సినీ లవర్స్ అంటున్నారు. ఈ గ్లింప్స్‌పై దర్శకుడు రాజమౌళి(Rajamouli) కూడా ప్రశంసలు కురిపించారు. గ్రేట్ జాబ్ అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ని ఆయన మెచ్చుకున్నారు. ఇలాంటి సినిమాలు తీయడం పెద్ద టాస్క్ అని, అయినా మీరు సాధించగలిగారని ఆయన అన్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించి ఓ సెన్సేషనల్ విషయం వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టులోకి రాజమౌళి అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమలహాసన్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు అశ్వినిదత్ కూడా ఈ మధ్యే చెప్పాడు. దీంతో రాజమౌళి కూడా ఇప్పటికే కల్కి ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాడని సమాచారం. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన జక్కన్న నాగ్ అశ్విన్‌కు తోడుగా షూటింగ్ కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. ఇదే విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండటంతో ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మాత్రం అలాంటిదేమి లేదని, జక్కన్న కల్కీ ప్రాజెక్ట్‌లో ఉన్నాడు కానీ డైరెక్షన్ టీమ్‌లో కాదని అంటున్నారు. కల్కీ సినిమాలో రాజమౌళి కామియో రోల్ పోసిస్తున్నట్లు మరికొందరు తెలుపుతున్నారు. అంటే జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్,మోహన్‌లాల్ లాంటి పాత్రలలో రాజమౌళి కనిపిస్తారన్నమాట! మొదట్లో ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది మే 9వ తేదీన రిలీజ్ చేయాలని డిసైడయ్యారట!
