ఎప్పుడు బిజీ బిజీ వర్క్స్.. సినిమాల కోసం ఏళ్ల తరబడి హోమ్ వర్క్.. బుర్రలో ఎప్పుడూ సినిమా ఆలోచనలే.. దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి(Rajamaoouli) పరిస్థితి ఇది. ఈక్రమంలో జక్కన్న కాస్త విశ్రాంతి కోసం ప్యామిలీతో కలిసి బయటకు వెళ్లారు. తమిళనాడు(Tamilnadu) పర్యటనకు వెళ్ళిన ఆయన రిలాక్స్ అయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలసి విహారంలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు.
ఎప్పుడు బిజీ బిజీ వర్క్స్.. సినిమాల కోసం ఏళ్ల తరబడి హోమ్ వర్క్.. బుర్రలో ఎప్పుడూ సినిమా ఆలోచనలే.. దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి(Rajamaoouli) పరిస్థితి ఇది. ఈక్రమంలో జక్కన్న కాస్త విశ్రాంతి కోసం ప్యామిలీతో కలిసి బయటకు వెళ్లారు. తమిళనాడు(Tamilnadu) పర్యటనకు వెళ్ళిన ఆయన రిలాక్స్ అయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలసి విహారంలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు. రాజమౌళి వెంట ఆయన భార్య రమ(Rama), కూతురు మయూఖతో(Mayukha) పాటు.. కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ(SS Karthikeya), అతడి భార్య పూజ(Pooja) ఉన్నారు. వీరంతా ట్యూటికోరిన్(Tuticorin) ప్రాంతంలో కొన్ని రోజుల పాటు గడిపారు.
ఆక్వా అవుట్ బ్యాక్(Aqua out back) అనే ప్రముఖ వాటర్ స్పోర్ట్స్ సెంటర్ దగ్గర.. బసచేసింది రాజమౌళి కుటుంబం. ఈ పర్యటనకు సబంధించిన ఫొటోలను ఆ రీసార్ట్ కు కు సబంధించిన ఇన్ స్టా గ్రామ్ పేజ్ లో షేర్ చేశారు. అంతే కాదు తమ పర్యటనకు గుర్తుగా రాజమౌళి అక్కడ ఓ మొక్కను(Plant) కూడా నాటారు. తిరిగి మరోసారి అక్కడకు వెళతామంటూ ఎస్ ఎస్ కార్తికేయ ప్రకటించారు. ఎస్ఎస్ రాజమౌళి సర్, రమా ఆంటీకి ఈ వారాంతంలో విడిది కల్పించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నానంటూ వీరికి ఆతిథ్యం ఇచ్చిన అనైనా అనే యువతి ఇన్ స్టా గ్రామ్ లో తన మెమరీని శేర్ చేసుకుంది.
ఇక రాజమౌళి.. ఆర్ఆర్ఆర్(RRR) అందించిన విజయం, ఆస్కార్ అవార్డ్(OSCAR) ఇచ్చిన కిక్కును ఎంజాయ్ చేస్తున్నారు. మరో వైపు తాను నెక్ట్స్ మహేష్ బాబుతో(Maheshbabu) చేయబోతున్న సినిమాకు సబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారుజక్కన్న. భారీ అడ్వెంచర్ మూవీగా.. పాన్ వరల్డ్ స్థాయిలో(Pan World) ఈ సినిమా రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఆయన ఏడాది ముందు నుంచే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. ఆయన టీమ్ ప్రస్తుతం ఈ పనుల్లో బిజీగా ఉన్నారట. మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది తెలియాల్సి ఉంది.