ఖర్చు అంచనాలకు మించిపోయినా, ఎక్కడా రాజీ అన్నది లేకుండా స్వప్నాదత్, స్రియాంకదత్‌లు దుల్కర్ సల్మాన్(Dulqer Salman), మృణాళినీ ఠాకూర్(Mrunal thakur) జంటగా హనూ రాఘవపూడి(Raghavudu) దర్శకత్వంలో రూపొందిన సీతారామం(sita ramam) చిత్రం అటు కలెక్షన్లతో పాటూ అందరి మన్ననలు పొంది, ఒక చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే.
ఖర్చు అంచనాలకు మించిపోయినా, ఎక్కడా రాజీ అన్నది లేకుండా స్వప్నాదత్, స్రియాంకదత్‌లు దుల్కర్ సల్మాన్(Dulqer Salman), మృణాళినీ ఠాకూర్(Mrunal thakur) జంటగా హనూ రాఘవపూడి(Raghavudu) దర్శకత్వంలో రూపొందిన సీతారామం(sita ramam) చిత్రం అటు కలెక్షన్లతో పాటూ అందరి మన్ననలు పొంది, ఒక చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఆ టైంలో సీక్వెల్(sequel) ఉంటుందని కొందరు, ఉండితీరాలి అని మరికొందరు ముమ్మరంగా వ్యాఖ్యానాలు చేశారు. కానీ దీని విషయమై వైజయంతీ సిస్టర్స్‌ఎక్కడా నోరు మెదపలేదు. వెంటనే కె షూటింగ్‌లోనూ, అన్నీ మంచి శకునములే షూటింగ్ కార్యక్రమాలలోనూ నిమగ్నమైపోయారు.
మళ్ళీ ఇన్ని నెలల తర్వాత సీతారామం పార్ట్ 2 గురించిన ప్రస్తావన వచ్చింది. అది కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నోటి వెంట రావడంతో ఈ టాసిక్‌కి ఎనలేని ప్రాముఖ్యత వచ్చింది. సోమవారం నాడు ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన అన్నీ మంచి శకునములే సినిమా ప్రొమోషనల్ ఈవెంట్‌కి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఏస్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, అశ్వనీదత్ ముఖ్యఅతిధులుగా వచ్చారు. ఈ వేదిక మీద మాట్లాడిన రాఘవేంద్రరావు మైకు పట్టుకోగానే సీతారామం పార్ట్ 2 టాపిక్కే ఎత్తుకున్నారు.
ఎంత ఆలోచించారో గానీ, సీతారామం పార్ట్ 2 కథాంశాన్ని అక్కడికక్కడే చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. సీతారామం చిత్రంలో సీత పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని, ఆమెను అలా వదిలివేయడం బాధగా ఉందని చెబుతూ, సీతారామం కథను పొడిగించి సీక్వెల్ తీస్తే తన మనసుకి ఊరట లభిస్తుందని సభాముఖంగా చెప్పడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అంటూ, అలవోకగా కథ ఎలా ఉండాలో కూడా వెంటవెంటనే చెప్పేశారు.
రామ్ చనిపోయాడన్న ఆవేదనతో సీత తుపాకీ తీసుకుని సీత విలన్ దగ్గరకు వెళ్తుందని, అప్పుడు విలన్ నీ రామ్ చనిపోలేదని, ఒక గుహలోకి తీసుకెళ్ళి రామ్‌ని విడిపించుకుని వచ్చాక, సీత కుటుంబ సభ్యలు వారిని వెంటాడతారని ఆయన రాసుకొచ్చినట్టుగా వల్లెవేశారు. సీత గురించి ఎప్పుడు తలుచుకున్నా సరే తన కళ్ళ వెంట నీళ్ళు ఆప్రయత్నంగా తిరుగుతాయని, సీతకు న్యాయం జరగాలంటే సీతారామం పార్ట్ 2 వస్తే సీతకు న్యాయం జరిగినట్టవుతుందని, తనకి కూడా న్యాయం చేసినట్టవుతుందని ఆయన చెప్పినప్పుడు అందరూ నవ్వడం పరిపాటిగా నవ్వారు గానీ, దర్శకేంద్రుడి మాటలు ఊరికే గాలికి వదిలేసే ప్రసక్తే ఉండదు. కుటుంబపరంగా తనకు చాలా దగ్గరైన స్వప్నాదత్‌ని ఆయన ఏదో విధంగా ఇన్‌స్పైర్ చేసి సీతారామం పార్ట్ 2 రావడానికి కారణమవుతారన్నది అందరి అభిప్రాయం.
"Written by Nagendra Kumar"