దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannath) కుమారుడు ఆకాశ్ పూరీ(Aaash Puri) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి క్లాస్‌మేట్‌ను ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకోబోతున్నాడు. ఆకాశ్ పూరీ పెళ్లి చేసుకునే అమ్మాయి సీనియర్ రాజకీయనాయుడి(Politician) మనవరాలని తెలుస్తోంది.

Akash Puri Marriage
దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh) కుమారుడు ఆకాశ్ పూరీ(Akash Puri) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి క్లాస్‌మేట్‌ను ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకోబోతున్నాడు. ఆకాశ్ పూరీ పెళ్లి చేసుకునే అమ్మాయి సీనియర్ రాజకీయనాయుడి(Politician) మనవరాలని తెలుస్తోంది. కోట్ల ఆస్తికి వారసురాలని కూడా అంటున్నారు. త్వరలో నిశ్చితార్థ కార్యక్రమం ఉంటుందని, వచ్చే ఏడాది పెళ్లి జరుగుతుందని చెబుతున్నారు. పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపిన తర్వాతే పెళ్లి వార్త బయటకు వచ్చింది. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూరీ ఆకాశ్ తర్వాత హీరో అయ్యాడు. ఆంధ్రాపోరి అనే సినిమాతో కథానాయకుడయ్యాడు. మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి సినిమాల్లో నటించాడు. ఇప్పటి వరకు ఆకాశ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఓ పెద్ద హిట్ కోసం ఆకాశ్ ఎదురుచూస్తున్నాడు.
