డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' (iSmart Shankar) సినిమా ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కాంబో మళ్లీ రిపీట్ అవ్వబోతుందనే వార్తలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.

iSmart Shankar 2
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' (iSmart Shankar) సినిమా ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కాంబో మళ్లీ రిపీట్ అవ్వబోతుందనే వార్తలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ అక్టోబర్‌లో ఈ కొత్త ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కాంబో కోసం ఇటు పూరీ ఫ్యాన్స్ అటు రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నెక్ట్స్ ప్రాజెక్టు హీరో కోసం డైరెక్టర్ పూరీ నానా తంటాలు పడుతుంటే.. ఇప్పుడు ఆ లోటును రామ్ పోతినేని భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇక పూరీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా సరిపోదు. సినిమాలను రాకెట్ కంటే స్పీడుగా మేకింగ్ చేస్తాడు ఆయన. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే ఆరు నెలలకంటే తక్కువ టైమ్‌లోనే షూటింగ్ ఫినిష్ చేస్తాడాయన. అండ్ అలాగే.. లో బడ్జెట్ సినిమాలు తీసి.. భారీ లాభాలను మూటగడ్డుకోవడం ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదునుకుంట. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి కంటే ముందు ఫ్లాపులతో ఉన్న ఆయనకు రామ్ పోతినేని చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'లైగర్' (Liger) సినిమా భారీ డిజాస్టర్ చవిచూసింది. ఆ తర్వాత అదే హీరోతో చేపట్టబోయే 'జనగణమన' (Jana Gana Mana) చిత్రం కూడా వెనక్కివెళ్లిపోయింది. దీంతో పూరీ మళ్లీ వెనక్కివెళ్లిపోయే సముద్రపు అలగా మిగిలిపోయారు. అయితే పూరీ జగన్నాథ్ ఎగసిపడే ఎరటం లాంటి వాడని పూరీ అభిమానులు బలంగా చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్ తీసి.. మళ్లీ ఆ క్రేజ్‌ని తెచ్చుకునే పనిలా పడ్డాడు మన పూరీ.
ఇదిలా ఉంటే రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల (Sreeleela) చేస్తున్నారు. అయితే ఈ సినిమాను 2023 అక్టోబర్ 20న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ పోతినేని చిత్రం చేయబోతున్నాడట. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), నభా నటేష్ (Nabha Natesh) హీరోయిన్లుగా నటించగా.. డైనమిక్ స్టార్ రామ్ పోతినేని డ్యుయల్ రోల్‌తో అదరగొట్టేశాడు. ఇప్పుడు మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుండటంతో అభిమానులంతా ఈ...య్ అంటున్నారు. ఈ చిత్రంతో కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నామంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.. ఆ శుభవార్త ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నామంటున్నారు సినీ లవర్స్.
