ఇప్పుడు సంక్రాంతి విన్నర్ హనుమాన్ సినిమానే! సంక్రాంతికి విడుదలైన పెద్ద సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టేసి బాక్సాఫీసు దగ్గర రయ్యిమంటూ దూసుకుపోతున్నది. హనుమాన్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో దర్శకుడు ప్రశాంత్‌వర్మ పేరు మారుమోగిపోతున్నది. ప్రశాంత్ వర్మకే కాదు, హీరో తేజ సజ్జ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ కాబోతున్నది. అయితే ప్రశాంత్ వర్మ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాడట! ఎన్నో చేదు అనుభవాలను చవిచూశాడట! ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మనే స్వయంగా చెప్పుకొచ్చారు.
ఇప్పుడు సంక్రాంతి విన్నర్ హనుమాన్ సినిమానే!(Hanuman movie) సంక్రాంతికి విడుదలైన పెద్ద సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టేసి బాక్సాఫీసు దగ్గర రయ్యిమంటూ దూసుకుపోతున్నది. హనుమాన్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో దర్శకుడు ప్రశాంత్‌వర్మ(Director Prashantvarma) పేరు మారుమోగిపోతున్నది. ప్రశాంత్ వర్మకే కాదు, హీరో తేజ సజ్జ(Hero Teja Sajja) కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ కాబోతున్నది. అయితే ప్రశాంత్ వర్మ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాడట! ఎన్నో చేదు అనుభవాలను (Bad experiences) చవిచూశాడట! ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మనే స్వయంగా చెప్పుకొచ్చారు. 'ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే నేను కొన్ని షార్ట్ ఫిలింస్, డ్యాకుమెంటరీలు చేశాను. నాకు వచ్చిన ప్రశంసా పత్రాలను ఓ సూట్‌కేసులో పెట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశాలు ఇస్తారేమోనని దర్శకుల చుట్టూ తిరిగేవాడిని. చాలా మంది నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అని వెనక్కిపంపేశారు. కొన్నిరోజులకు పరిస్థితి అర్థమయ్యింది. సర్టిఫికెట్లు లేకుండా తిరిగాను. ఓసారి ఒకరి సిఫారసుతో ఓ ప్రముఖ దర్శకుడిని కలిశాను. ఆయన ముందు కూర్చున్న రెండు నిమిషాలకు రేయ్, నీళ్లు తీసుకురా అని అన్నాడు. ఆఫీసు బాయ్‌ను పిలుస్తున్నాడేమోనని అనుకున్నాను. బయ్ కూడా దిక్కులు చూస్తున్నాను. అప్పుడా దర్శకుడు నా వంక చూస్తూ నీళ్లు తెమ్మన్నది నిన్నేరా అన్నాడు. చాలా బాధగా అనిపించింది. వెంటనే నేను కిచెన్‌లోంచి నెమ్మదిగా ఆఫీస్ బయటకు వచ్చేశాను. ఇది జరిగి దాదాపు తొమ్మిదేళ్లు అవుతోంది. ఇటీవల ఆ దర్శకుడే సాయం కోసం మా ఆఫీసుకు వచ్చాడు. ఆయన నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా పాతముచ్చట్లు చెప్పుకుండా అతడికి కావాల్సిన సాయం చేసి పంపించాను. మరో సందర్భంలో ఓ పెద్ద దర్శకుడు, నిర్మాత మాట్లాడుకుంటున్నారు. నేను వారికి కొంత దూరంలో నిలబడి ఉన్నాను. అప్పుడా దర్శకుడు నన్ను చూసి.. నీకిక్కడ ఏం పనిరా.. వెళ్లిపో అని బూతులు తిట్టారు. ఆ తర్వాత నన్ను తిట్టిన ఆ వ్యక్తే నా భుజం మీద చేయి వేసి మా వాడే .. మా వాడే అని చెప్పుకొచ్చాడు. సినిమా పరిశ్రమలో ఇవన్నీ సర్వ సాధారణం కావచ్చు. కానీ నేను మాత్రం ఆ అవమానాలు తట్టుకోలేకపోయాను. చిన్నప్పట్నుంచి ఇంట్లో నన్ను ఏమనేవారు కాదు. ఒకరి దగ్గర మాట పడే రకం కాదు నేను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలను సహించాల్సి వచ్చింది. చాలాసార్లు ఇది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఇంటికెళ్లిపోదామని అనుకున్నాను. కానీ ఏదైతే అదనుకొని పరిశ్రమలోనే ఉంటూ నిలదొక్కుకున్నాను' అని ప్రశాంత్ వర్మ తెలిపాడు.