మరోసారి టాలీవుడ్ సినిమా బాలీవుడ్(Bollywood) కు ఝలక్ ఇచ్చింది. బాలీవుడ్ పై విమర్శలు వచ్చేలా చేసింది. బాలీవుడ్ స్టార్స్ మధ్చ చిచ్చు పెట్టింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. నాని దసరా. తాజాగా నాని దసరా(Dasara) సినిమా పాన్ ఇండియ రేంజ్ లో భారీ విజయం సాధించింది. సక్సెస్ తో పాటు బాలీవుడ్ (Bollywood) లో చిచ్చుకూడా పెట్టింది దరసరా సినిమా. హిందీలో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈసినిమా రిలీజ్ టైమ్ లోనే వచ్చిన అజయ్ దేవగణ్(Ajay Devagan)భోళా సినిమా మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

మరోసారి టాలీవుడ్ సినిమా బాలీవుడ్(Bollywood) కు ఝలక్ ఇచ్చింది. బాలీవుడ్ పై విమర్శలు వచ్చేలా చేసింది. బాలీవుడ్ స్టార్స్ మధ్చ చిచ్చు పెట్టింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. నాని దసరా.

తాజాగా నాని దసరా(Dasara) సినిమా పాన్ ఇండియ రేంజ్ లో భారీ విజయం సాధించింది. సక్సెస్ తో పాటు బాలీవుడ్ (Bollywood) లో చిచ్చుకూడా పెట్టింది దరసరా సినిమా. హిందీలో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈసినిమా రిలీజ్ టైమ్ లోనే వచ్చిన అజయ్ దేవగణ్(Ajay Devagan)భోళా సినిమా మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. మొదటి మూడు నెలల్లో బాలీవుడ్(Bollywood) లో పఠాన్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఏమి లేకుండా పోయింది. దీంతో.. మరోసారి బాలీవుడ్ లో చర్చతో పాటు.. రచ్చ కూడా స్టార్ట్ అయ్యింది.

బాలీవుడ్(Bollywood) సినిమాలను టాలీవుడ్ తో పోలుస్తూ.. వారిపై విమర్షలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ (Bollywood) లోనే తమ మేకర్స్ పై .. యాక్టర్స్ పై సెటైర్లు వేసేవారు ఎందరో.. అందులో కంగనా రనౌత్ తో పాటు కాశ్మీరి ఫైల్స్(Kashmir Files) డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా సౌత్ సినిమాలతో బాలీవుడ్(Bollywood) ను పోలుస్తూ.. రకరకాల వార్తలు వివేక్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా నాని దసరా సినిమాను పోలుస్తూ.. ఓ ట్వీట్ చేశాడు దర్శకుడు.

బాలీవుడ్(Bollywood) లో ఎప్పటినుంచో ఉన్నా కశ్మీర్ ఫైల్స్(Kashmir Files) సినిమాతో ఒక్కసారిగా ఇండియా(India) అంతా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ వివేక్ రంజాన్ అగ్నిహోత్రి(Vivek Ranjan Agnihotri). బాలీవుడ్ మాఫియాపై, బాలీవుడ్ ని రూల్ చేస్తున్న కొంతమంది స్టార్స్ పై రెగ్యులర్ గా కామెంట్స్ చేస్తున్నాడు వివేక్. ఇటీవల గత కొన్నాళ్ళు బాలీవుడ్ దీన స్థితిలో ఉన్నప్పుడు వివేక్ బాలీవుడ్ పై గట్టిగానే విమర్షలు చేశాడు. బాలీవుడ్ లో జరిగే విషయాలన్నీ తన ట్విట్టర్(Twitter) ద్వారా పోస్ట్ చేస్తూ వచ్చాడు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ పై, బాలీవుడ్(Bollywood) స్టార్స్ పై మరోసారి వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు. బాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఓపెనింగ్‌కి కూడా గ్యారెంటీ ఇవ్వలేని స్టార్‌లకు ఊహించలేనంత ఎక్కువ రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు. అలాంటి వాళ్లకు ఆ రేంజ్ లో రెమ్యునరేషన్స్ ఇవ్వడంతో బాలీవుడ్ సంతోషంగానే ఉన్నట్టు ఉంది. స్టార్స్ లైఫ్ స్టైల్ మీద సినీ నిర్మాణం వాళ్ళు ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారు. తప్పు జరుగుతుంది అని ట్వీట్ చేశాడు. ఈ విషయాన్ని గతంలో స్టార్ ప్రొడోయూసర్ కరణ్ జోహార్ కూడా అన్నాడు. దీంతో ఇప్పుడు వివేక్ రంజాన్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Updated On 5 April 2023 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story