సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటించిన జైలర్(Jailer) సినిమా సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నది. రజనీ యాక్షన్, స్టయిల్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటించిన జైలర్(Jailer) సినిమా సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నది. రజనీ యాక్షన్, స్టయిల్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణను(Nandhamuri Balakrishna) తీసుకోవాలని అనుకున్నానని, కానీ అది సాధ్యపడలేదని నెల్సన్ తెలిపారు. 'స్క్రీన్‌పై రజనీకాంత్ సర్ ఒక్కరు కనిపిస్తేనే విపరీతమైన జోష్ వస్తుంది. అందుకే ఈ సినిమాను మల్టిస్టారర్‌గా తీయాలని అనుకోలేదు. ప్రత్యేక ఆకర్షణ కోసమే మోహన్‌లాల్(Mohanlal), శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌లను ఎంపిక చేశాను.
వీరి నటించడం వల్ల జైలర్ మల్టిస్టారర్ సినిమా అనే ఊహాగానాలు వచ్చాయ. ఇందులోని ఓ పోలీసు పాత్ర కోసం తెలుగు అగ్ర కథానాయకుడు బాలకృష్ణను అనుకున్నాను. కానీ కథాపరంగా ఆ క్యారెక్టర్‌ను సరిగా డిజైన్ చేయలేకపోయాను. అలాంటప్పుడు బాలకృష్ణను ఎంపిక చేయడం సరైంది కాదనిపించింది. అందుకే ఆయనను సంప్రదించలేదు. నటించేందుకు ఆయన అంగీకరించేవారో కాదో తర్వాతి సంగతి. భవిష్యత్తులో బాలయ్యతో సినిమా చేస్తానేమో' అని నెల్సన్ దిలీప్‌కుమార్ అన్నారు. ఒకవేళ జైలర్‌లో బాలయ్య కూడా నటించి ఉంటే సినిమా మరో రేంజ్‌లో ఉండేదనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. యాక్షన్ నేపథ్యంలో రూపొందిన జైలర్‌లో రజనీకాంత్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా నటించారు. జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, యోగిబాబు, వసంత్ రవి, మిర్నా మేనన్ ప్రధాన పాత్రలు పోషించారు.