యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో(Prabhas) దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2898 ఎ.డి(Kalki 2898 AD) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వైజయంతి మూవీస్(Vyjayanthi movies) పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పడుకొనే(Deepika padukone) ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. కానీ ఇప్పుడీ సినిమా వేసవిలో రానున్నట్టు వార్తలు వస్తున్నాయ.

Kalki 2898 AD
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో(Prabhas) దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2898 ఎ.డి(Kalki 2898 AD) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వైజయంతి మూవీస్(Vyjayanthi movies) పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పడుకొనే(Deepika padukone) ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. కానీ ఇప్పుడీ సినిమా వేసవిలో రానున్నట్టు వార్తలు వస్తున్నాయ. ఇదే విషయాన్ని నాగ్ అశ్విన్‌ను అడిగినప్పుడు తనదైన శైలిలో స్పందించారు. 'గ్రహాలు, నక్షత్రాలు ఎలా అనుకూలిస్తాయో చూడాలి. అప్పుడే మాకు దానిపై స్పష్టత వస్తుంది' అని నాగ్ అశ్విన్(Nag Ashwin) చిత్ర విడుదల వాయిదా అంశాన్ని ఎటూ తేల్చకుండా వదిలేశారు నాగ్ అశ్విన్.
సినిమా ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నకు 'అందరూ ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు' అని చెప్పారు. 'ఈతరం ప్రేక్షకులు కొత్త ప్రపంచాన్ని ఆశిస్తారు. కానీ, ఇది వారి అంచనాలను మించే విధంగా ఉంటుంది. ఇందులో మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ కనిపిస్తారు. థియేటర్‌కు వచ్చిన వారంతా కొత్త అనుభూతి పొందుతారు’ అని నాగ్ అశ్విన్ తెలిపారు. వినూత్నమైన సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్(amitabh bachchan) కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరో కమలహాసన్(Kamal Hassan) నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
