లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హీరోగా ఆయన రికార్డ్ లు వేరు.. అటువంటిది ఆయన విలన్ పాత్ర వేయడం.. అది కూడా మన తెలుతు ప్రాజెక్ట్ లో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఆపోజిట్ రోల్ చేయడం.. అసలు ఇది సాధ్యమేనా.. అంటే ప్రస్తుతం మీడియా వ్యాప్తంగా వినిపిస్తున్న కథనాలు ప్రకారం ఇది నిజం అయ్యేలాగే ఉంది.

ప్రభాస్ కు విలన్ గా కమల్ హాసన్ వినడానికే వింతగా ఉన్న.. ఈ వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. అంతే కాదు ఈసినిమా కోసం ఆయన ఎన్నికోట్లు డిమాండ్ చేశాడో తెలుసా..?

లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హీరోగా ఆయన రికార్డ్ లు వేరు.. అటువంటిది ఆయన విలన్ పాత్ర వేయడం.. అది కూడా మన తెలుగు ప్రాజెక్ట్ లో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఆపోజిట్ రోల్ చేయడం.. అసలు ఇది సాధ్యమేనా.. అంటే ప్రస్తుతం మీడియా వ్యాప్తంగా వినిపిస్తున్న కథనాలు ప్రకారం ఇది నిజం అయ్యేలాగే ఉంది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత విక్రమ్ సినిమాత్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు కమల్. ఈ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడుతమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న కమల్.. ఇండియాన్ 2 తో పాటు.. మణిరత్నం డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.

ఇక లేటెస్ట్ బజ్ ప్రాకారం కమల్ ప్రాజెక్ట్ కేలో విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటిస్తున్నభారీ చిత్రం ప్రాజెక్ట్ కే. అమితాబ్ లాంటి లెజండ్స్ నటిస్తున్న ఈసినిమాలో మెయిన్ విలన్ పాత్రలో కమల్ కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. అయితే ప్రభాస్ కు విలన్ గా ప్రాజెక్ట్ కెలో నటించడానికి యూనిట్ లోకనాయకుడిని సంప్రదించినట్టు తెలుస్తోంది.

అంతే కాదు కమల్ ను ఈ పాత్రకు ఎలాగైనా ఒప్పించాలని.. అందుకోసం 150కోట్ల వరకూ రెమ్యూనరేషన్ ఇవ్వడానికైనా వారు సిద్దంగా ఉన్నట్టుతెలుస్తోంది. కమల్ కూడా ఈ పాత్రపై సానుకూలంగా స్పందించారని సమాచారం. అయితే కొందరు మాత్రం ఇందులో నిజం లేదని అంటున్నారు. దీనిపై మున్ముందు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

యంగ్ డైరెక్టర్ మహానటి ఫేమ్.... నాగ్ అశ్విన్(nag ashwin) ‘ప్రాజెక్ట్ కే’(Projectk)ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చకా చకా కొనసాగుతోంది. వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్ ను కూడా ప్రారంభించినట్టు గతంలోనే నిర్మాత వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని అంటున్నారు. చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated On 10 Jun 2023 12:16 AM GMT
Ehatv

Ehatv

Next Story