దర్శకుడు లోకేశ్ కనగరాజ్(Lokesh Kanaka Raj) షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఖైదీ(Khaidi) సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న కనగరాజ్ లాస్టియర్ కమలహాసన్(Kamal Hassan)) హీరోగా వచ్చిన విక్రమ్‌తో(Vikram) సత్తా చాటుకున్నారు. విక్రమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను కుమ్మరించిందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్(Vijay Thalapathy) హీరోగా లియో(Leo) అనే సినిమాను రూపొందిస్తున్నారు.
దర్శకుడు లోకేశ్ కనగరాజ్(Lokesh Kanaka Raj) షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఖైదీ(Khaidi) సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న కనగరాజ్ లాస్టియర్ కమలహాసన్(Kamal Hassan)) హీరోగా వచ్చిన విక్రమ్‌తో(Vikram) సత్తా చాటుకున్నారు. విక్రమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను కుమ్మరించిందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్(Vijay Thalapathy) హీరోగా లియో(Leo) అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విజయ్ పుట్టిన రోజు సందర్భంగా లోకేశ్ సంచలన వ్యాఖ్య చేశారు. హాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ క్వింటెన్ టరెంటీనోలా(Quinten Turrenti) తాను కూడా పది సినిమాలు(10 Films) చేసిన తర్వాత ఫిల్మ్ మేకింగ్(Film Making) ఆపేస్తానని ప్రకటించారు. కనగరాజు తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
'నాకు సుదీర్ఘ ప్రణాళికలు లేవు. అలాగే సినిమా ఇండస్ట్రీలో శాశ్వతంగా ఉండాలన్న కోరిక అసలు లేదు. నేను సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చాను. అందుకే మొదట షార్ట్ ఫిల్మ్స్(short Film) చేశాను. నాకు గుర కుదిరిన తర్వాత దీన్ని ఒక వృత్తిగా స్వీకరించాను. నేను పది సినిమాల వరకూ చేస్తాను. ఆ తర్వాత పరిశ్రమ నుంచి వెళ్లిపోతాను' అని కనగరాజ్ అన్నారు. ' ఒక కథలో సినిమటిక్ యూనివర్స్ సృష్టించడం అంత ఈజీగా కాదు. చాలా విషయాలపై దృష్టి పెట్టాలి. ప్రతి సినిమాకు సంబధించిన నిర్మాత, సంగీత దర్శకుడి నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలి. నాతో పని చేసిన నిర్మాతలు, నటులకు ధన్యవాదాలు. వారి వల్లే సినిమాటిక్ యూనివర్స్ సాధ్యమవుతోంది.
ఎల్‌సీయూలో పది సినిమాలు వస్తాయేమో చూద్దాం. రెండోసారి విజయ్ అన్నతో పని చేయడం ఆనందంగా ఉంది. పది రోజుల్లో విజయ్ పోర్షన్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయనను మిస్ అవుతాను. లియోసినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా కాదా అన్నది తెలుసుకోడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మూడు నెలలు ఎదురుచూస్తే మీకే తెలుస్తుంది' అని లోకేశ్ కనగరాజ్ అన్నారు. లియో సినిమా కశ్మీర్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. వచ్చే నెల చివరి నాటికి సినిమా కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టి అక్టోబరు నాటికి సినిమాను రెడీ చేయాలన్నది లోకేశ్ ప్లాన్. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా త్రిష నటిస్తున్నారు. సంజయ్ దత్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ మేనన్, మన్సూర్ అఖీఖాన్, శాండీ మాస్టర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ రజనీకాంత్(Rajini kanth), కమల్‌హాసన్(Kamal Hassan), సూర్య(Surya), కార్తీలతో(Karthi) సినిమాలు చేయల్సి ఉంది. ప్రభాస్‌తో(prabhas) కూడా ఓ సినిమా చేస్తారని టాక్.