కోలీవుడ్ లో దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kankaraj). స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ..వరుససక్సెస్ లు సాధిస్తూ.. తమిళ పరిశ్రమలో తన మార్క్ చూపిస్తున్నాడు.ఒకప్పుడు ఉద్దండులు ఏలిన తమిళ పరిశ్రమను యంగ్ స్టార్ మరో స్టెప్ ఎక్కిస్తున్నారు.తమిళ సినిమా మేకింగ్ ను కంప్లీట్ గామార్చేస్తున్నారు. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు లోకేష్ కనగరాజ్.

కోలీవుడ్ లో దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kankaraj). స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ..వరుససక్సెస్ లు సాధిస్తూ.. తమిళ పరిశ్రమలో తన మార్క్ చూపిస్తున్నాడు.ఒకప్పుడు ఉద్దండులు ఏలిన తమిళ పరిశ్రమను యంగ్ స్టార్ మరో స్టెప్ ఎక్కిస్తున్నారు.తమిళ సినిమా మేకింగ్ ను కంప్లీట్ గామార్చేస్తున్నారు. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు లోకేష్ కనగరాజ్. ఖైదీ సినిమాతో డైరెక్టర్ గా తానేంటో నిరూపించుకున్న లోకేష్ మొదటి సినిమా మాత్రం మా నగరం, ఖైదీ తరువాత మనోడి ఇమేజ్ మారిపోయింది. ఇక ఆతరువాత వరుసగా.. మాస్ట‌ర్(Master), విక్ర‌మ్(Vikram), లియో(Leo) సినిమాల‌తో సంచలనంగా మారాడు లోకేష్ కనగరాజ్ . ఇక ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్‌(Rajinikanth) హీరోగా త‌లైవ(Thalaiva) 171 ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

ఈసినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో చూపించబోతున్నాడు దర్శకుడు. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉండ‌గా.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. లోకేష్ కనగరాజ్ కు సబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే.. లోకేష్ కనగరాజ్ ఫేస్‌బుక్‌(Facebook) పేజీ హ్యాక్‌కు(Hack) గురైందట.

ఇక ఈ విష‌యంలో స్వయంగా స్పందించారు దర్శకుడు లోకేష్. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయన స్పందించాడు. ఇంతకీ లోకేష్ ఏమన్నాడంటే.. నా ఫేస్‌బుక్ పేజీ హ్యాక్‌కు గురైందని అని వ‌స్తున్న వార్తలు అవాస్తవం. ఎందుకంటే నాకు ఫేస్‌బుక్‌ పేజీ లేదు. నేను ట్విట్టర్ అనగా ఎక్స్ తో పాటు ఇన్ స్ట్రా గ్రామ్ ఖాతాలను మాత్రమే కలిగి ఉన్నాను.అవి త‌ప్ప నేను సోష‌ల్ ఏ ఇత‌ర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో లేను. ఫేస్‌బుక్‌లో నా పేరు మీద ఏదైనా ఖాతా ఉంటే అది ఫేక్ అకౌంట్. అలాంటి ఖాతాల‌ను ఫాలో అవ్వ‌కండని లోకేష్ రాసుకోచ్చాడు.

Updated On 14 Dec 2023 7:01 AM GMT
Ehatv

Ehatv

Next Story