తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.. ఆయన తన సోషల్ మీడియా(Social media Accounts) అకౌంట్ ను క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఆయన ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి..?

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.. ఆయన తన సోషల్ మీడియా(Social media Accounts) అకౌంట్ ను క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఆయన ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి..?

లియో(Leo) సినిమాతో మరో హిట్టు తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. విజయ్ దళపతికి(Vijay Thalapathy) సూపర్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు తాజాగా తీసుకున్న నిర్ణయం అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా జనాలను కలవరపెడుతుంది. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారంటే.. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతున్నారు. ఇంత సడెన్ గా లోకేష్ కు ఏమయ్యింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంతా ఆలోచనలో పడ్డారు.

ఈయన సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియాకు దూరం కావడం ఏంటీ అని అంతా అనుకున్న టైమ్ లో.. ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు లోకేష్.

తాజా గా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు లోకేశ్ కనగరాజ్‌. ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య యుద్దం నడుస్తుండగా.. తనపై చూపిస్తున్న ద్వేషం, ట్రోలింగ్స్‌ ను చూశాను అన్నారులోకేష్. తమపై ఇతరులు చేస్తున్న విమర్షలకు తమనతో పాటు.. అభిమానులు కూడా కలత చెందుతున్నానన్నారు. ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోల బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. కానీ ఇది అసభ్యంగా.. అసహ్యంగా మారుతుంది.. అంతేకాదు అభిమానులు వారి పోస్ట్‌లలో నన్ను ట్యాగ్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నాకు రోజూ వేల సంఖ్యలో ఇలాంటి పోస్ట్‌లు వస్తుంటాయి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు. అంతే కాదు.. అభిమానుల పేరు చెప్పుకుని.. అరాచకంచేసేవారికి కౌంటర్ కూడా ఇచ్చారు దర్శకుడు. సినిమా అనేది రెండున్నారగంటల వినోదం మాత్రమే.. అది మీకు రిలీఫ్ ఇవ్వాలి.. టెన్షెన్స్ నుంచి దూరం చేయాలి.. కాని హీరోలు గ్రూప్ లు.. అంటూ.. ఇక్కడ కూడా మనశాంతి లేకుండా చేసుకుంటున్నారు. ఈ విషయాలను పర్సనల్ గా తీసుకుని.. ఎదుటివారిని శత్రువుల్లా భావించ వద్దుచఅని హిత బోద చేశారు లోకేష్ కనగరాజ్.

Updated On 22 Oct 2023 5:25 AM GMT
Ehatv

Ehatv

Next Story