సంక్రాంతి పండక్కి వచ్చిన హనుమాన్(Hanuman) సినిమా ఘన విజయం సాధించింది. మహేశ్‌బాబు(Mahesh babu) నటించిన గుంటూరుకారం, వెంకటేశ్(Venkatesh) నటించిన సైంధవ్, నాగార్జున(Nagarjuna) నటించిన నా సామిరంగలను దాటేసి దూసుకుపోయింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజైన ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగానే వసూలు చేసింది. ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా 300 సెంటర్లలో 30 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలను తెచ్చిన సినిమాగా హనుమాన్ రికార్డు సృష్టించింది.
సంక్రాంతి పండక్కి వచ్చిన హనుమాన్(Hanuman) సినిమా ఘన విజయం సాధించింది. మహేశ్‌బాబు(Mahesh babu) నటించిన గుంటూరుకారం, వెంకటేశ్(Venkatesh) నటించిన సైంధవ్, నాగార్జున(Nagarjuna) నటించిన నా సామిరంగలను దాటేసి దూసుకుపోయింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజైన ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగానే వసూలు చేసింది. ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా 300 సెంటర్లలో 30 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలను తెచ్చిన సినిమాగా హనుమాన్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం హనుమాన్ గురించి సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్(Nithin) హీరోగా శ్రీ ఆంజనేయం(Sri Anjaneyam) అనే సినిమా వచ్చింది. దీనికి హనుమాన్‌కు కొన్ని పోలికలు ఉన్నాయి. ఛార్మి హీరోయిన్‌గా నటించిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. స్టోరీ బాగున్నప్పటికీ ప్రేక్షకులకు కొన్ని పాయింట్లు నచ్చలేదు. గ్రాఫిక్స్ బాగానే ఉన్నా ప్రేక్షకులు ఎందుకో కనెక్ట్ కాలేకపోయారు. హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం సినిమానే బాగుందని కొందరు నెటిజన్లు కృష్ణవంశీ ఎక్స్ పేజీలో కామెంట్లు చేస్తున్నారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కృష్ణవంశీ(Krishna vamsi) రియాక్టవుతూ 'దయచేసి ప్రేక్షకులను తిట్టకండి, వాళ్ల నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు. శ్రీ ఆంజనేయం సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని అంశాలు ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు' అని అన్నారు. శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మి క్యారెక్టర్ చాలా చిరాకు పుట్టించిందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. దీనికి మాత్రం కృష్ణవంశీ మాత్రం గాడ్‌బ్లెస్ యు అని రిప్లై ఇచ్చారు. నిజానికి ఆ సినిమా ఫ్లాప్‌కు ఛార్మి పాత్రే కారణమని అప్పట్లో అన్నారు. ఆమె గొప్ప నటే కానీ ఆ సినిమాలో మాత్రం ఆమె పాత్రను క్రియేట్ చేసిన విధానం బాగోలేదన్నారు. మితిమీరిన ఎక్స్‌పోజింగ్ సాంగ్ ఉండటం ఎవరికీ నచ్చలేదని అప్పడన్నారు.