✕
Virupaksha Sequel : విరూపాక్షకు సీక్వెల్ కూడా ఉందా..? డైరెక్టర్ కార్తీక్ ఏమంటున్నాడంటే..?
By EhatvPublished on 25 April 2023 1:59 AM GMT
విరూపాక్ష సక్సెస్ తో.. దిల్ ఖుష్ అవుతున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజం ఎంత..?

x
గతవారం విడుదలై విజయఢంకా మోగించిన విరూపాక్ష(virupaksha) వీరవిహారంతో అన్ని సెంటర్లో చెలరేగుతోంది. సుప్రీం హీరో సాయిధర్మతేజ(Sai Dharam Tej) హీరోగా, సంయుక్తా మీనన్(Samyuktha menon) కాంబినేషన్లో కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకుడిగా సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఎస్వీసిసి(SVCC) పతాకంపైన భోగవల్లి ప్రసాద్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన విరూపాక్ష విడుదలకు ముందు నుంచే చాలా సందడి చేసింది. తెలియని ఆకర్షణ, ఆదరణ విరూపాక్షని మొదటి నుంచీ ముద్దాడుతూనే ఉన్నాయి. ట్రైలర్, టీజర్లు విరూపాక్ష ఇమేజ్‌ని అమాంతం పెంచేశాయి.
-
- విరూపాక్షకి ముఖ్యంగా కలిసివచ్చిన పాయంట్ మరొకటి ఉంది. అదే మౌత్ టాక్! ఈ మధ్య రోజులలో సోషల్ మీడియా తీర్పులు సినిమా రిఉల్టుని ఆటు నుంచి ఇటు తిప్పేస్తున్నాయి. ఎలా ఉందో ఓ సారి చూద్దాంలే అనే పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మాయమైపోయింది. ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే యుఎస్ రిపోర్టులు. తర్వాత ఇక్కడి సోషల్ మీడియా దాడి. ఈ రెండింటి మధ్యనా ఏ సినిమా అయినా సరే బతికి బట్టకట్టడమంటే అది ఎనిమిదో వింతే. అలాటిది ఈ రెండు అవరోధాలను విరూపాక్ష ముందుగా దాటేసింది. జయహో అనిపించుకుంది. తర్వాత ఇక్కడి ప్రశంసల వెల్లువ బాగా ప్లస్ అయింది. మోర్నింగ్ షోకి ఓ మోస్తరుగా ఉన్నా కూడా, మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయి మ్యాట్నీ నుంచి విరూపాక్ష విజృంభణ ప్రారంభమైంది.
-
- సుకుమార్ మాటలు, ఆయన ప్రోత్సాహం కూడా సినిమాకి పాజిటివ్ బజ్ రావడానికి అద్భుతంగా పనిచేసింది. ఏడు సంవత్సారల పాటు చంకనేసుకుని ఎక్కే గడపా, దిగే గడపాలా దర్శకుడు కార్తీక్ మోసుకు తిరిగిన కథ ఇప్పుడు వీర ఖడ్డంలా జైత్రయాత్రలు సాధిస్తుంటే....అన్నాళ్ళ పాటు కార్తీక్ ఎక్కిదిగిన ప్రతీ గడపా సిగ్గు పడాలి. అటువంటి కథని తిరస్కరించినందుకు. తృణీకరించినందుకు. పరిశ్రమలో తన తర్వాతి యంగ్ డైరెక్టర్లు చాలా మందికి కార్తీక్ గొప్ప నైతిక బలాన్ని చేకూర్చాడు. అటువంటి కథను మనసా మెచ్చుకుని ఆదరించినందుకు సుప్రీం హీరోకి ఎన్ని మార్కులు వేయాలో ఇప్పటి కలెక్షన్లే చెప్పక చెబుతాయి. Written by నాగేంద్రకుమార్
-
- ట్రైలర్ రిలీజ్‌నాడు, ఇద్దరు ఏస్ ప్రోడ్యూసర్లు అల్లు అరవింద్(Allu Arvindh), దిల్‌రాజు(Dil Raju) ఇద్దరికీ ఇద్దరూ కూడా విరూపాక్ష విజయం పట్ల గట్టిగానే మాట్లాడారు. అప్పటికి అది ఏదో ప్రోత్సాహం గురించి మాట్లాడుతున్నారని కొందరనుకున్నా, విడుదల తర్వాత విరూపాక్ష దుమ్ము దులిపేసింది. ఇప్పుడు రెండో వారంలోకి ప్రవేవిస్తూనే 62 కోట్ల భారీ కలెక్షన్లతో వీరవిహారం చేస్తోంది విరూపాక్ష. ఇందులో గమ్మత్తేంటంటే హీరో సాయి దర్మతేజ, దర్శకుడు కార్తీక్ ఇద్దరికీ ఇద్దరి ప్రాణాలు ప్రమాదం అంచున చాలా రోజులు ఊగిసలాడి విజేతలుగా వెలువడి ప్రాణాలు పెట్టి మరీ చేసిన సినిమాగా విరూపాక్షకి ఎక్కడలేని శక్తిసామర్ధ్యాలు కలసివచ్చాయి. సెంటిమెంటల్‌గా అందరి ప్రార్ధనలతో పాటు, టీమ్ మొత్తం రాత్రీ పగలు కష్టపడి ఫైనల్‌గా అంత అద్భుతమైన అవుట్‌పుట్ తీసుకోరావడంతో విరూపాక్షుడే విరూపాక్షని అనుగ్రహించినట్టయింది. భగవంతుడి అనుగ్రహం తర్వాత. ముందు కష్టే ఫలి అనే నానుడికి విరూపాక్ష చిత్రం సచిత్ర నిదర్శనంగా నిలబడుతుంది. అందుకే కష్టం ఫలించిందంటారు. అది పూర్తిగా విరూపాక్ష విషయంలో నిజమైంది.
-
- సాయిధరమ్ తేజ్ కు వరుసగా సక్సెస్ విషెష్ తెలియజేస్తున్నారు సెలబ్రిటీలు. రామ్ చరణ్ కూడా కంగ్రాట్స్ బ్రదర్ అంటూ ట్వీట్ చేశారు. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కూడా సాయి ధరమ్ తేజ్ ను విష్ చేశారు. మరో వైపు కల్యాణ్ రామ్ కూడా సాయి తేజ్ నుఅభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ఇలా సెలబ్రిటీస్ కూడా విరూపాక్ష మూవీపై ప్రసంసలు కురిపిస్తున్నారు.

Ehatv
Next Story