తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరుస విషాదాలతో కూరుకుపోతోంది. లెజెండరీ డైరెక్టర్ కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరులోని తెనాలిలో జన్మించారు. ఆయన చనిపోవడంతో చిత్ర పరిశ్రమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘శంకరభరణం’ చిత్రం రిలీజైన రోజు ఆయన కన్నుమూయడం చాలా బాధాకరం. ఇక ఆయన సినీ ప్రస్థానానికి […]

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరుస విషాదాలతో కూరుకుపోతోంది. లెజెండరీ డైరెక్టర్ కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరులోని తెనాలిలో జన్మించారు. ఆయన చనిపోవడంతో చిత్ర పరిశ్రమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘శంకరభరణం’ చిత్రం రిలీజైన రోజు ఆయన కన్నుమూయడం చాలా బాధాకరం. ఇక ఆయన సినీ ప్రస్థానానికి వస్తే..

1957లో వచ్చిన తోటికోడళ్లు సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా పని చేశారు ఆయన. విశ్వనాథ్ పనితనం నచ్చడంతో ఆదుర్తి సుబ్బారావు ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆయన దగ్గరే ‘ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, మూగమనసులు వంటి చిత్రలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ‘ఆత్మగౌరవం’ చిత్రంతో విశ్వనాథ్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే నంది అవార్డును అందుకున్నారన్నాయన. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు ఆయనకి. ఫస్ట్ లో కొన్ని కమర్షియల్ సినిమాలను కూడా ఆయన డైరెక్ట్ చేశారు. శోభవన్ బాబు హీరోగా తెరకెక్కించిన చెల్లెలి కాపురం చిత్రంతో కళాతపస్వి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తెలుగు సినిమాకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చారు కళాతపస్వి కె. విశ్వనాథ్.

ఆయన డైరెక్షన్ చేసే సినిమాలకు ఎక్కువగా కె.వి మహదేవన్, ఇళయరాజా వంటి మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకునేవారు. కొన్ని సినిమాల్లో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో పనిచేయడానికి కళాతపస్వి విశ్వనాథ్ ఇష్టపడేవారు.

శంకరాభరణం చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో శాస్త్రీయ సంగీతానికి ప్రియారిటీ ఇచ్చేవారు. శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం వంటి సినిమాల్లో శాస్త్రీయ సంగీతం కనిపిస్తుంది. శాస్త్రీయ సంగీతంలో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుందనేది చూపించడం ఆయన సాధ్యమైంది.

2016లో ఆయన్ని దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు వరించింది. ఎల్వీ ప్రసాద్, బిఎన్ రెడ్డి తర్వాత దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు అందుకున్న గొప్ప దర్శకులు ఆయన. కళాతపస్వి తీసిన సినిమాలు ఇప్పటి దర్శకులకు ఒక ఆదర్శంగా నిలిచాయి. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన సినిమాలు బతికే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కె. విశ్వనాథ్ జీవితం ఆధారంగా ‘విశ్వదర్శనం’ పేరుతో బయోపిక్ ను డైరెక్టర్ జనార్ధన మహర్షి డైరెక్ట్ చేయనున్నారు.

Updated On 3 Feb 2023 5:22 AM GMT
Ehatv

Ehatv

Next Story