ధనుష్(dhanush) హీరోగా ఆయన అన్న సెల్వరాఘవన్(Selvaraghavan) దర్శకత్వం వహించిన కాదల్‌కొండేన్(KadalKonden) సినిమా సూపర్‌హిట్టయ్యింది. ఈ సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయమయ్యారు సోనియా అగర్వాల్(Sonia Aggarwal). అందుకు ముందు ఏడాది అంటే 2022లో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు సోనియా అగర్వాల్. ఆ తర్వాత సెల్వరాఘవన్ దృష్టిలో పడ్డారు ఈ చండీగఢ్ భామ. అలా తమిళంలో కాదల్ కొండేన్, 7జీ రెయిన్‌బో కాలనీ వంటి పలు చిత్రాలలో నటించి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు.
ధనుష్(dhanush) హీరోగా ఆయన అన్న సెల్వరాఘవన్(Selvaraghavan) దర్శకత్వం వహించిన కాదల్‌కొండేన్(KadalKonden) సినిమా సూపర్‌హిట్టయ్యింది. ఈ సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయమయ్యారు సోనియా అగర్వాల్(Sonia Aggarwal). అందుకు ముందు ఏడాది అంటే 2022లో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు సోనియా అగర్వాల్. ఆ తర్వాత సెల్వరాఘవన్ దృష్టిలో పడ్డారు ఈ చండీగఢ్ భామ. అలా తమిళంలో కాదల్ కొండేన్, 7జీ రెయిన్‌బో కాలనీ వంటి పలు చిత్రాలలో నటించి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. తర్వాతి కాలంలో దర్శకుడు సెల్వ రాఘవన్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహబంధం ఎక్కవ కాలం కొనసాగలేదు. నాలుగేళ్లకే వీరిద్దరువ విడిపోయారు. ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్న సోనియా అగర్వాల్ నటనపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆమె ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమాకు 7జీ అనే పేరు పెట్టారు. నటి శ్రుతి(shruthi), వెంకట్(Venkat) నటిస్తున్న ఈ సినిమాలో సోనియా అగర్వాల్ దెయ్యం పాత్రలో నటిస్తున్నారు. హారూన్(Haroon) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. 2004లో సోనియా అగర్వాల్ నటించిన 7 జీ రెయిన్‌బో కాలనీ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఆమె నటిస్తున్న సినిమాకు 7జీ అనే పేరును పెట్టడంతో ఈ చిత్ర దర్శకుడికి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయట! 7జీ అనే టైటిల్‌ను ఎవరు రిజిస్టర్ చేయకపోవంతో తమ సినిమాకు ఆ టైటిల్ పెట్టామని దర్శకుడు హారూన్ అంటున్నారు. 7జీ అనే ఇంట్లో షూటింగ్ నిర్వహించడం, కథకు అది సెట్టవ్వడంతో ఆ టైటిల్‌ను ఖరారు చేశామన్నారు. అయితే తమ చిత్రానికి ఈ పేరు పెట్టకూడదని కొందరి నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని చెప్పారు. తాము టైటిల్‌ను మార్చే ప్రసక్తే లేదని, ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని హారూన్ అంటున్నారు.