మలయాళం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన 2018 సినిమా తెలుగులో రాబోతున్నది. శుక్రవారం డబ్బింగ్‌ సినిమా విడుదలవుతోంది. టోవినో థామస్‌(Tovino Thomas), కుంచక్కో బోబన్‌(Kunchakko Boban), వినీత్‌ శ్రీనివాస్‌(Vineeth Srinivas), అసిఫ్‌ అలీ(Asif Ali), అపర్ణ బాలమురళి(Aparna Balamurali) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికే 130 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

మలయాళం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన 2018 సినిమా తెలుగులో రాబోతున్నది. శుక్రవారం డబ్బింగ్‌ సినిమా విడుదలవుతోంది. టోవినో థామస్‌(Tovino Thomas), కుంచక్కో బోబన్‌(Kunchakko Boban), వినీత్‌ శ్రీనివాస్‌(Vineeth Srinivas), అసిఫ్‌ అలీ(Asif Ali), అపర్ణ బాలమురళి(Aparna Balamurali) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికే 130 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. జూడ్‌ ఆంటోని జోసెఫ్‌(Jude Antony Joseph) దర్శకత్వం వహించిన ఈ సినిమాను బన్నీ వాసు(Bunny Vasu) తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌(Harish shankar) కూడా పాల్గొన్నారు. సినిమా చాలా బాగుందని, తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ఆయన అన్నారు.

మన తెలుగు దర్శకులు ఇలాంటి సినిమా తీయగలరా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు గట్టిగానే జవాబిచ్చారు హరీశ్‌ శంకర్‌. 'ప్రపంచ సినిమా ఇప్పుడు మన చేతికొచ్చేసింది. అటువంటి టెక్నాలజీలో ఉన్నాం. ట్రిపులార్‌(RRR), బాహుబలి(Bahubali), కేజీఎఫ్‌ల(KGF)ను డబ్బింగ్‌ సినిమాలని అనుకోలేదు కదా? డబ్బింగ్‌, రీమేక్‌ అదంతా ఏమీ లేదు. కేవలం సినిమా అంతే! తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయరా? అని మీరు అడిగారు. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్న ఈ సమయంలో మీరు ఇలాంటి ప్రశ్న అడిగారంటే జాలి వేస్తుంది. అతడు కేరళ డైరెక్టర్‌ అని ఈ సినిమా చూడలేదు. ఆయనో గొప్ప సినిమా తీశారని పత్రికాముఖంగా ఆయన్ను మెచ్చుకుందామని వచ్చాను' అని హరీశ్‌ శంకర్‌ ఇచ్చిన సమాధానంతో విలేకరి సైలెంటయ్యారు.

Updated On 25 May 2023 1:40 AM GMT
Ehatv

Ehatv

Next Story