మాస్ మహారాజ రవితే(c) నటించిన మిస్టర్ బచ్చన్(Mr.Bachchan) సినిమా అతి పెద్ద డిజాస్టర్.
మాస్ మహారాజ రవితే(raviteja) నటించిన మిస్టర్ బచ్చన్(Mr.Bachchan) సినిమా అతి పెద్ద డిజాస్టర్. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ కూడా ఇంత ఘోరంగా దెబ్బతింటుందని అనుకోలేదు. నామ్‌తో సునా హోగా అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమాపై చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇంతకు ముందు రవితేజ, హరీశ్ శంకర్(Haris shankar) కాంబోలో షాక్, మిరపకాయ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందుకే అంచనాలు పెరిగాయి. ఇండిపెండెన్స్ కానుకగా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన నష్టాల కారణంగా దర్శకుడు హరీశ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. నిర్మాతకు తన పారితోషికంలోంచి రెండు కోట్ల రూపాయలు ఇచ్చేశాడు. ఆరు కోట్లు వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్న హరీశ్ శంకర్ ముందు రెండు కోట్లు ఇచ్చాడు. మరో నాలుగు కోట్లు తర్వాత చేయబోయే సినిమాకు ఇచ్చే రెమ్యూనిరేషన్లో కట్ చేసుకోమని హరీశ్ చెప్పాడట! హరీశ్ తీసుకున్న నిర్ణయం సముచితమే! నెటిజన్లు కూడా హరీశ్ నిర్ణయానికి హాట్సాఫ్ చెబుతున్నారు. రవితేజ అభిమానులు కూడా! అయితే రవితేజ ఈ సినిమాకు పాతిక కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్! ఆయన కూడా అంతో ఇంతో వెనక్కి ఇచ్చేస్తే రియల్ హీరో అవుతాడు!