దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఒక సినిమా కంప్లీట్ అయ్యే లోపు..మరో సినిమా స్టార్ట్ చేస్తూ..యంగ్ హీరోలకు కూడా షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా చేస్తున్న బాలయ్య.. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మెగా డైరెక్టర్ బాబీతో సినిమా ఓపెనింగ్ చేసేశాడు. ఈ క్రమంలో బాలయ్యను డిఫరెంట్ గా చూపించబోతున్నాడట డైరెక్టర్ బాబీ. ఇంతకీ ఎలా చూపించబోతున్నాడు.. కథ ఎలా ఉంటుంది..? అన్న ఆలోచన పెరిగిపోయింది ఫ్యాన్స్ లో.

వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు బాలయ్య బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో(anil Ravipudi) సినిమా చేస్తున్న బాలకృష్ణ(Balakrishna).. మెగా డైరెక్టర్ బాబీతో(Bobby) నెక్ట్స్ సినిమా ను అనౌన్స్ చేశారు. ఈ మూవీని డిఫరెంట్ గా ప్లాన్ చేశారట బాబీ.

దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఒక సినిమా కంప్లీట్ అయ్యే లోపు..మరో సినిమా స్టార్ట్ చేస్తూ..యంగ్ హీరోలకు కూడా షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా చేస్తున్న బాలయ్య.. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మెగా డైరెక్టర్ బాబీతో సినిమా ఓపెనింగ్ చేసేశాడు. ఈ క్రమంలో బాలయ్యను డిఫరెంట్ గా చూపించబోతున్నాడట డైరెక్టర్ బాబీ. ఇంతకీ ఎలా చూపించబోతున్నాడు.. కథ ఎలా ఉంటుంది..? అన్న ఆలోచన పెరిగిపోయింది ఫ్యాన్స్ లో.

ఇక తాజాగా ఈసినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాబీ ఈసినిమాను వాల్తేరు వీరయ్య(Waltheru Veeraya) స్ట్రాటజీతో రూపొందించబోతున్నారట. ఎప్పుడూ చూస్తున్నట్టుగా బాలయ్య మార్క్ యాక్షన్ డ్రామాలా కాకుండా.. ఈసినిమాను పక్కా ఫ్యామిలీ మూవీగా తెరకెక్కించబోతున్నారట బాబీ. అంతే కాదు ఈసినిమాలో బాలయ్యను ఎమోషనల్ క్యారెక్టర్ లో చూపించనున్నట్టు సమాచారం. అంతేనా.. బాబీ మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేరు వీరయ్యను ఇలానే ఎమోషనల్ టచ్ తోనే చేసి సక్సెస్ అయ్యారు.ఇప్పుుడుబాలయ్య కు కూడా అదే ఫార్ములా వాడబోతున్నాడట.

ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజను పెట్టి.. బ్రదర్ సెంటిమెంట్ పండించాడు... ఇప్పుడు బాలయ్య సినిమా కోసం కూడా ఓ యంగ్ హీరోను సెలక్ట్ చేసుకునేపనిలో ఉన్నాడట దర్శకుడు. బాలీవుడ్ నుంచి కాని.. తమిళ పరిశ్రమ నుంచి కాని యంగ్ హీరోను దింపుతాడట. అంతే కాదు ఫ్యామిలీ డ్రామాకు .. ఎమోషన్స్ ను ఆడ్ చేసి కథను రాసుకున్నాడట బాబీ. బాలయ్య అంటే యాక్షన్.. అన్నట్టు ఉంటుంది. అటువంటిది... ఈసారి కాస్త డిఫరెంట్ గా ట్రై చశారట టీమ్.
ఈసినిమాలో యాక్షన్ కన్నా.. ఫ్యామిలీ ఎమోషన్సే ఎక్కువ ఉంటాయట. పైగా బాలయ్య క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. అన్నట్టు పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట.దర్శకుడు బాబీ ఈ సినిమా కథలో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చాడట. ఏది ఏమైనా రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా వస్తే మాత్రం.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఇక్ ఈమధ్య బాలయ్య బాబు ఎక్కువగా డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా సినిమాలో బాలయ్య ఓల్డ్ గెటప్ ఓ రేంజ్ లో ఉంటుందని టాక్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.

Updated On 30 July 2023 11:51 PM GMT
Ehatv

Ehatv

Next Story