రెండు సినిమాలు..రెండువేల కోట్లకు పైగా కలెక్సన్లు.. బాలీవుడ్ కు భగవంతుడుగా మారిపోయాడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan). ఇక జవాన్(Jawan) సినిమా అయితే దగ్గరగా 1200 కోట్లకు దగ్గరగా కలెక్ట్ చేసింది. అయితే ఇవి ఫేక్ కలెక్షన్స్ అంటూ.. బాలీవుడ్ లోనే గుసగసలువినిపిస్తుండగా..తాజాగా జవాన్ మూవీ సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ హీరోగా..నయనతార(Nayanthara) హీరోయిన్ గా.. దీపికా పదుకునే(Deepika padukone) ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా జవాన్. తమిళ దర్శకుడు అట్లీ(Atlee) డైరెక్ట్ చేసిన ఈసినిమా.. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా రూపొందింది. సెప్టెంబ‌ర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చీ రావడంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుందీ సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కు జవాన్ దాదాపుగా 1150 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి బాలీవుడ్‌ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. వ

రుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడ్డ షారుఖ్.. రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుసగా వెయ్యికోట్లు కలెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఇక ఈ ఏడాది పఠాన్‌తో(Pathan) వెయ్యి కోట్లు కొల్లగొట్టిన షారుఖ్‌.. జవాన్‌తో పఠాన్‌ రికార్డులను పక్కకు నెట్టేశాడు. తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా జవాన్ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న‌ట్లు ద‌ర్శ‌కుడు అట్లీ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపాడు. దీనితో పాటు ఒక స్పెష‌ల్ నోట్ ను కూడా పోస్ట్ చేశాడు. జవాన్ సినిమా మీ ముందుకు వచ్చి 50 రోజులవుతోంది. ఈ మూవీ వ‌చ్చి 50 రోజులు గడిచినా ఇప్పటికీ కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకుంటుంది. ప్రపంచమంతా జవాన్ హవా కనిపిస్తూనే ఉంది అంటూ అట్లీ తన నోట్ లో రాశారు.

ఇక 50 రోజులు అవుతున్నా.. ఇంకా జవాన్ హవా కొనసాగుతూనే ఉంది. 50వ రోజు కూడా సుమారు 11లక్షల వరకూ వసూలు చేసిందీ సినిమా ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాతో అటు షారుఖ్ ఫ్యాన్స్.. ఇటు బాలీవుడ్ అభిమానులు కూడా దిల్ ఖుష్ అవుతున్నారు.

Updated On 28 Oct 2023 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story