తమిళస్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee).. డిఫరెంట్ కామెంట్ల చేశాడు. జవాన్(Jawan) రిలీజ్ అయ్యిసూపర్ హిట్ అయినప్పటి నుంచి.. కాస్త డిఫరెంట్ గా మాట్లాడుతూ వస్తోన్న అట్లీ.. ఈసారి తలైవా రజినీకాంత్(Rajinikanth) మూవీ గురించి మాట్లాడాడు. మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు.. ట్రోల్స్ కు గురైన దర్శకుడు.. ఈసారి రజినీకాంత్ తో సినిమాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

డైరెక్టర్ అట్లీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రజినీకాంత్‌ తో చేయబోయే సినిమా గురించి కూడా డిఫరెంట్ కామెంట్స్ చేయడంతో పాటు.. ఈమూవీపై క్లారిటీ ఇచ్చాడు అట్లీ. తాను రజినీకాంత్‌కు వీరాభిమానినని.. అంతే కాదు రజినీకాంత్ తనను ముద్దుగా కన్నా అని పిలుస్తారని.. తనతో సినిమాకు సూపర్ స్టార్ ఎప్పుడూ రెడీగానే ఉంటాడు అన్నారు. తలైవా నటించిన దళపతి(Thalapthy) సినిమా చూసిన తర్వాతే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చానని అన్నాడు.

రోబో(Robo) సినిమాకు శంకర్‌(Shankar) దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశానని చెప్పాడు అట్లీ. తలైవా తనతో సినిమాకు ఎప్పుడూ రెడీగా ఉంటాడని.. రెండు మూడు కథలు కూడా చర్చించుకున్నామని.. కాని ఆయనకు సరిపోయే పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌ సిద్దం కాలేదని, భాషా నుంచి మించిపోయేలా సినిమా ఉండాలని తాను అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అట్లీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనతో సినిమా తీయ్యడమేమో కాని.. అట్లీ ఇలా చెప్పడం చిత్రంగా ఉందంటున్నారు సినిమా జనాలు.

అయితే అట్లీ నెక్ట్స్ సినిమాపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కాని అట్లీ ఈలోపు చేసిన కామెంట్స్ అందరిచేత ఔరా అనిపిస్తున్నాయి. జవాన్ సక్సెస్ తరువాత తన నెక్ట్స్ మూవీ ఏకంగా 3000 కోట్లు వసూళు చేయబోతుందన్ని అప్పుడు అన్నారు అట్లీ. షారుఖ్ ఖాన్, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నట్లు చెప్పారు.

అంతటితో ఆగకుండా.. మరోసారి.. జవాన్ సినిమాను ఆస్కార్ కు తీసుకెళ్తాను అన్నాడు అట్లీ... అప్పుడు కూడా ట్రోల్స్ గట్టిగానే వచ్చాయి. ఇంకోసారి.. తనకు హాలీవుడ్ నుంచి సినిమాలు చేయాల్సిందిగా మేకర్స్ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని.. స్పానిష్ సినిమా కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..వెంటనే రమ్మంటున్నారంటూ కామెంట్స్ చేశాడు.

Updated On 18 Nov 2023 7:32 AM GMT
Ehatv

Ehatv

Next Story