టాలీవుడ్ లోకి మాటల రచయితగా అడుగు పెట్టి.. దర్శకుడిగామారి వరుస సినిమాలు తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. పటాస్(Patas) తో మొదలు పెట్టి.. సరిలేరు నీకెవ్వరు(Sarileru Nikevaru) లాంటి సూపర్ సక్సెస్ సినిమాలు అదించిన అనిల్ రావిపూడి. షూటింగ్ స్పాట్ లో ఫన్నీ గాఉంటారు రీల్స్ చేస్తారు. డాన్స్ లు వేస్తారు.. కామెడీ చేస్తారు.. ఇలా మల్టీ టాలెంట్ చూపిస్తుంటారు అనిల్ రావిపూడి.

వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). మల్టీ టాలెంట్ చూపిస్తున్న ఈ యంగ్ స్టార్.. తాజాగా బాలయ్య పాటకు స్టెప్పులేసి అలరించాడు.

టాలీవుడ్ లోకి మాటల రచయితగా అడుగు పెట్టి.. దర్శకుడిగామారి వరుస సినిమాలు తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. పటాస్(Patas) తో మొదలు పెట్టి.. సరిలేరు నీకెవ్వరు(Sarileru Nikevaru) లాంటి సూపర్ సక్సెస్ సినిమాలు అదించిన అనిల్ రావిపూడి. షూటింగ్ స్పాట్ లో ఫన్నీ గాఉంటారు రీల్స్ చేస్తారు. డాన్స్ లు వేస్తారు.. కామెడీ చేస్తారు.. ఇలా మల్టీ టాలెంట్ చూపిస్తుంటారు అనిల్ రావిపూడి. అంతే కాదు ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా టీమ్ లను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి.. తన అందరు డైరెక్టర్లలా కాదు అని నిరూపించుకున్నారు అనిల్ రావిపూడి.

ప్రస్తుతం అనిల్ బాలయ్య బాబుతో(Bala Krishna) ఆయన 108వ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ శరవేంగంగా సాగుతోంది. బాలయ్య ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. ఈక్రమంలో ..ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్లతో కలిసి కాలు కదుపుతూ.. అదిరిపోయే స్టెప్పులు వేశారు అనిల్ రావిపూడి. గతంలో కూడా ఎఫ్3 టైమ్ లో .. కుర్రాడు బాబోయ్ సాంగ్ కు హీరోలతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసి వావ్ అనిపించాడు. ఇక ఇప్పుడు మాత్రం ‘నట్టు లూజు దానా బాలయ్య, బాలయ్య..ఫిట్టు చేయరానా’ అంటూ లారీ డ్రైవర్ సినిమాలోని పాటకు డ్యాన్సులు చేశారు.

ఈ పాటతో.. ఈసినిమా లారీ డ్రైవర్ కథ చుట్టు తిరుగుతుందని అర్ధం అవుతోంది. అంతే కాదు ఫైట్ మాస్టర్ తో పని అయిపోయింది. ఇక డాన్స్ మాస్టర్ పని మాత్రమే మిగిలి ఉంది అనట్టుగా సింబాలిక్ గా చెప్పాడు దర్శకుడు. ఇందులో ఇప్పటికే ఫైట్స్ ముగిసినట్లు తెలుస్తోంది. ఇక పాటలపై కసర్తుతులు మొదలు పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రీల్ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనికి నెటిజన్ల నుండి కామెంట్లు వస్తున్నాయి. మీరు హీరోగా ట్రై చేయొచ్చు కదా.. మీరు మంచి డైరెక్టరే కాదూ.. మంచి డ్యాన్సర్ కూడా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు.

Updated On 19 May 2023 12:50 AM GMT
Ehatv

Ehatv

Next Story